మసీదు లక్ష్యంగా న్యూజిలాండ్ లో కాల్పులు.  సెంట్రల్ క్రిస్ట్‌చర్చ్‌లోని ఓ మసీద్‌లో గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 40కి చేరింది.  అయితే ఈ ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృటిలో తప్పించుకుంది.  ఈ ఘటన క్రిస్ట్‌చర్చ్‌ సెంట్రల్‌ సిటీలోని హగ్లీపార్క్‌ మజీదులో చోటు చేసుకుంది. కాల్పుల సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఉన్నారు. అయితే తాము సేఫ్‌గా ఉన్నట్లు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘షూటర్ల నుంచి మొత్తం టీం తప్పించుకుంది.
zealand-mosque-shooting
ఇది చాలా భయంకరమైన అనుభవం. మీ అందరి ప్రార్థనలే మమ్మల్ని కాపాడాయి’’ అంటూ తమీమ్ పేర్కొన్నాడు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అందులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.  హగ్లీపార్కు సమీపంలో ఉన్న మజీద్ వద్దకు మార్చి 15వ తేదీ శుక్రవారం ఇద్దరు దండగులు చేరుకున్నారు. వెంటనే తెచ్చుకున్న గన్‌లతో ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపారు. 
Image result for new zealand shooting
ప్రార్థన చేస్తున్న చాలా మంది రక్తపు మడుగులో పడిపోయారు. హగ్లే ఓవెల్‌లోని మైదానంలో బంగ్లా క్రికెట్ జట్టు ప్రాక్టీస్‌కి వెళ్తున్నారు..ఆ సమయంలో తుపాకుల మోత వినపడటంతో అలర్ట్ అయ్యారు.  ఆ తర్వాత వాళ్లు సురక్షితంగా హోటల్‌కి చేరుకున్నారు.  ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ఈ దాడినంతా లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా గుర్తించారు. ఇతని కోసం న్యూజిలాండ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: