దేశమంతా ఒక ఎత్తు.. ఉత్తర ప్రదేశ్ ది ఒక ఎత్తు..! ఢిల్లీ పీఠం దక్కాలంటే ఉత్తరప్రదేశ్ పీఠం దక్కించుకుంటే చాలనేది నానుడి. అందుకే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వాటికి పోటీగా ఎస్పీ, బీఎస్పీల కూటమి పక్కా ప్లాన్ తో ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో యూపీలో ట్రయాంగిల్ వార్ జరగనుంది.

Image result for uttar pradesh parties

నిన్న మొన్నటి వరకు యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తక్కువ. బీజేపీయేతర కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ కూడా కాంగ్రెస్ తో పొత్తేంటి అంటూ చిన్న చూపు చూశాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే కీలకం కాబోతోందనేది విశ్లేషకుల అంచనా. ఆ పార్టీ చీల్చబోయే ఓట్లు ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, బీజేపీల తలరాతలను మార్చబోతున్నాయి. అందుకే ఇప్పుడు యూపీలోని పార్టీలన్నింటికీ కాంగ్రెస్ భయం పట్టుకుంది.

Image result for uttar pradesh parties

ఉత్తర ప్రదేశ్ లో 80 పార్లమెంటు స్థానాలున్నాయి. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు. అయితే ఎస్పీ, బీఎస్పీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టేశాయి. కాంగ్రెస్ మాత్రం చివరి వరకు ఎస్పీ, బీఎస్పీల కూటమిలో చోట కోసం తీవ్ర ప్రయత్నాలే చేసింది. కానీ అవేమీ ఫలించలేదు. దీంతో ఒంటరిగా బరిలో దిగేందుకు సిద్ధమైంది. ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చి.. మిగతా పార్టీలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది.

Image result for uttar pradesh parties

కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు గెల్చుకునే బలం లేదుగానీ.. ఆ పార్టీకి కొన్ని చోట్ల బలమైన ఓట్ బ్యాంకు ఉంది. ఆప్పుడు ఆ పార్టీయే విజేత ఎవరన్నది నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009, 2014 ఎన్నికల ఫలితాలు అధారంగా ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ గెలిచిన నియోజవర్గాల్లో 2014లో బీజేపీ పాగా వేసింది. అక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ అమాంతంగా పెరిగింది. అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ భారీగా కోసుకుపోయి.. బీజేపీ వైపు టర్న్ అయింది. ఇప్పుడు ఆ నియోజవర్గాల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ను సొమ్ము చేసుకుని.. కాంగ్రెస్ పార్టీ తన పాత ఓట్ బ్యాంకును తిరిగి సంపాదించగలిగితే.. అది బీజేపీ విజయం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

Image result for priyanka gandhi

2014లో కాంగ్రెస్ ఓట్ బ్యాంకులో 50 శాతానికిపైగా బీజేపికి మళ్లింది. ఎస్పీ, బీఎస్పీ ఓట్ బ్యాంకు పెద్దగా చీలలేదు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ 2009 నాటి ఓటు బ్యాంకులో సగం తిరిగి సంపాదించుకున్నా.. అది బీజేపీకి  ఊహించని దెబ్బే అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అదే జరిగితే కాంగ్రెస్ ఒంటరిపోరుతో బీజేపీ విలవిల్లాడిపోయే పరిస్థితి నెలకొంటోంది. ఈ విషయం తెలిసే అఖిలేష్, మాయవతి ముందే లెక్కలన్నీ వేసుకున్నారని సమాచారం. కాంగ్రెస్ తో బీజేపీ ఓట్లకే కోత పడుతుందని నిర్ధారించుకున్న తర్వాతే తమ కూటమికి.. కాంగ్రెస్ ను దూరం పెట్టారని అంచనా. కాంగ్రెస్ పార్టీ తన పాత ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకుంటే మాత్రం బీజేపీయే ఎక్కువగా నష్టపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: