దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అనుంగు సోదరుడు, మంత్రిగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గా పలు పదవులు నిర్వహించిన రాజకీయ మేటి వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తేలింది. ఈ మేరకు పోస్ట్ మార్టం చేసిన పోలీసులు నివేదికలో వెల్లడించారు. సాదుజీవి, ఆజాతశత్రువుగా పేరున్న వివేకాను ఎవరు హత్య చేసి ఉంటారన్నది చర్చగా మారింది.


అనుమానస్పద స్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసులు, అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు.


ఈ మొత్తం వ్యవహరంపై వైసీపీ ఇపుడు రగులుతోంది. కడపను కొట్టి తీరుతామని చెప్పిన టీడీపీ ఇలా చేస్తుందా అంటూ అపుడే వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. సిట్ దర్యాప్తు తో తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. చూడాలి ఎన్నికల వేళ జరిగిన ఈ పరిణామం ఏ మలుపు తీసుకుంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: