ఎవరైనా చిన్న చిరునామా చెబితేనే వెంటనే థాంక్స్ అంటాం. అలాంటిది పెద్ద పెద్ద ఉప‌కారాలు చేస్తే థాంక్స్ చెప్పలేరా.  లాజిక్ గా ఆలోచిస్తే  ఇది కరెక్టే. కానీ ఓ ఆఫీసులో జీతానికి కుదుర్చుకున్న  పని వాడు బాగా పనిచేస్తే యజమాని థాంక్స్ చెబుతాడా. 


ప్రజాస్వామ్యం ఇది. ప్రజలే ప్రభువులు. ప్రజా ప్రతినిధులు సేవకులు. బాగా సేవకులు పనిచేస్తే ప్రజలు సంతోషిస్తారేమో. అంతే కానీ నీకు థాంక్స్ ఎప్పటికీ నీవే  మాకు దిక్కు అంటు బానిస మనస్తత్వం చాటుకుంటారా. మన ప్రజాస్వామ్యంలో ఇలా ఉంటుందా. ప్రజాస్వామ్యం అంటేనే మార్పు. ఎంత బాగా చేసినా పోటీ ఉంటే మరొకరికి అవకాశం ఇవ్వడమే బ్యూటీ ఆఫ్ డెమోక్రసి. అంతే తప్ప ఒక నాయకున్నే, ఆ నాయకుడి కుటుంబాన్నే  పదే పదే అందలం ఎక్కించి రాచరిక పాలన తీసుకురమ్మని  ప్రజాస్వామ్యంలో  ఎక్కడా చెప్పలేదు. తెలివైన ఓటరు ఎపుడు బెస్ట్ చాయిస్ ఎంచుకుంటాడు. పోటీ పెట్టి అందులో నుంచి ఉత్తమ సేవలు అందుకుంటాడు.


విషయానికి వస్తే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకు థాంక్స్ చెప్పమంటున్నారు. ఓట్లు వేయమంటున్నారు. అంతేనా ఏకంగా తన వల్ల లబ్ది పొందిన వారంతా రోడ్ల మీదకు వచ్చి టీడీపీ కార్యకర్తల మాదిరిగా ఓట్లు అడగాల‌ని కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఖర్చు చేసేది ఎవరి సొమ్ము. అది ప్రజలదే. హామీలు నెరవేర్చితే మంచిదే. అంతే తప్ప నాకే జీవిత కాలం ఓటేయాలి. అది మీ బాధ్యత. లేకపోతే థాంక్స్ అంటే అర్ధం తెలియని వారు అవుతారంటూ ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడమేంటి.


పైగా నాకంటే మీకే నా అవసరం ఎక్కువగా ఉంది. నేను మళ్ళీ రావాలని గట్టిగా కోరుకోండి అంటూ బాబు చెప్పడం డబాయింపు కాక మరేమి అవుతుంది. ప్రజాస్వామ్యంలో చేసినవి చెప్పుకుని ఓట్లు అడుగుతారు. జనం నచ్చితే వేస్తారు లేకపోతే లేదు. కానీ ఇలా ఓట్లు వేయకపోతే అంటూ చెప్పడం బాధాకరమే. తొలి జాబితా విడుదల సందర్భంగా చంద్రబాబు గంటన్నర సేపు ఇలాగే మాట్లాడారు. ఎంత బేలగా అంటే అంత బేలగా వేడుకున్నారు. నన్నే గెలిపించడంటూ పదే పదే విన్నవించుకున్నారు. తనకు పోటీ లేదంటూనే ఇలా జనాలని ఓట్లు అడగడం వెనక అసలు  సంగతేంటో.   150 సీట్లు ఖాయం అంటున్న బాబు ధీమాగా హుందాగా ఓట్లు అడిగి గెలవలేరా అంటూ సెటైర్లు పడుతున్నాయిపుడు.



మరింత సమాచారం తెలుసుకోండి: