వైఎస్సార్ పాదయాత్ర సందర్భంగా చెప్పుకున్నారు. తనకు ప్రజలతో కలసి తిరగడం వల్ల గొప్ప అనుభవం వచ్చిందని, తన కోపం నరం తెగిపోయిందని. కానీ నిజానికి వైఎస్సార్ కోపాలు, పగలు వంటివెపుడూ లేని జీవితమే గడిపారు. ఆయన చదివింది వైద్య శాస్రం. పేదలకు వైద్యం చేయడం, సేవ చేయడం మాత్రమే ఆయనకు తెలుసు.


వైఎస్సార్ తండ్రి వైఎస్ రాజారెడ్డి 1998 మే 23న దారుణ హత్యకు గురి అయ్యారు. ఇడుపులపాయలోని తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చూసేందుకు వెళ్ళిన ఆయన్ని వేట కొడవళ్లతో దాడి చేసి మరి ప్రత్యర్ధులు  దారుణంగా హత్య చేశారు. ఫ్రాక్షన్ కక్షలతో జరిగిన హత్య ఇది. హత్య చేసిన వారు ఎవరో కూడా  తెలిసినా వైఎస్ ఆ జోలికి పోలేదు. జరిగింది జరిగింది. ప్రశాంతంగా ఉందామంటూ ప్రేమను పంచే మార్గానే  అనుసరించారు.


అయినా కడపలో హత్యలు ఆగడం లేదు. కత్తికి ఎదురుగా ప్రేమను చూపినా కూడా అవి కంఠాన్నే కోరుతున్నాయి. వైఎస్సార్ర్ ముఖ్యమంత్రిగా ఉండగా అనుమానాస్పదస్థితిలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అది వైఎస్ కుటుంబంలో రెండవ దారుణం. ఇక ఈ మధ్యనే  పాదయాత్రలో అలుపెరగని శ్రామికునిగా ఉన్న జగన్ మీద పట్ట పగలు విశాఖ విమానాశ్రమంలో హత్యా యత్నం జరిగింది. అక్టోబర్ 25న జరిగిన ఈ దాడి మరువక ముందే ఇపుడు జగన్ చిన్నాన్న తన సొంత వూళ్ళో సొంత ఇంట్లో దారుణ హత్యకు గురి అయ్యారు. 


దీన్ని బట్టి తేలుతోందేంటంటే వైఎస్ కుటుంబం కక్షా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా నీడలా వారిని అవే వెంటాడుతున్నాయి అనిపిస్తోంది. ఈ ధోరణి మార్చాల్సిన వారే సొంత ప్రయోజనాల కోసం పాలు పోసి పెంచుతున్నారనిపిస్తోంది. ఏది ఏమైనా అన్నింటి కంటే విలువైనది మనిషి ప్రాణం. ఇప్పటికైనా కక్షలకు కార్పణ్యాలకు దూరంగా ఉండాలి అంతా. అభివ్రుధ్ధి వైపుగా పోటీ పడాలి. ప్రజాస్వామ్యంలో పదవులు ముఖ్యం కాదు, బతుకులు ముఖ్యం.



మరింత సమాచారం తెలుసుకోండి: