వై ఎస్ వివేకా మర్డర్ గురించే ప్రస్తుతం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు .. ఇది పొలిటికల్ మర్డర్ అంటూ మాటలు వినిపిస్తున్నాయి. అధికార ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకోవాలి అని వైకాపా ఆరోపిస్తోంది. సీబీఐ తో విచారణ జరిపించాలి అనీ సిట్ విచారణ వెయ్యడం కరక్ట్ కాదు అనీ వైకాపా సెరిఔస్గ ఆ ఉంది.



మరొక పక్క రాయలసీమ జనాలు కూడా ఈ దారుణం వెనక ఎవరు ఉన్నారు అనేది మొత్తం బయటకి రావాలి అని ప్రశ్నిస్తోంది. ఈ మధ్య కాలం లో ప్రశాంతంగా ఉన్న రాయలసీమ ప్రాంతం ఒక్కసారిగా ఈ మర్డర్ తో భగ్గుమంది. మొదట ఇది గుండెపోటు అనుకున్నా పోస్ట్ మార్టం  తరవాత మాత్రం ఇది ఖచ్చితంగా మర్డర్ అనే తేలింది.



దాంతో పోలీసులు సైతం ఉలిక్కి పడ్డారు. రీసెంట్ గా మీడియా తో మాట్లాడిన విజయ్ సాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ , చంద్రబాబు లు కలిసి ప్లాన్ చేసి ఈ మర్డర్ చేసారు అని ఆయన ఆరోపణ .



హంతకుడికి టీడీపీ ఆఫీస్ లో రక్షణ కలిపించారు అనే ఆరోపణ కూడా చేసారు. అప్పట్లో చంద్రబాబు అసంబ్లీ లో ఫినిష్ ఐపోతారు అన్న కొద్ది రోజులకే వై ఎస్ చనిపోయారు అనీ ఇప్పుడు అలాంటిదే జరిగింది అనీ అన్నారు విజయ్ సాయి రెడ్డి.


మరొక పక్క హత్యకి సూత్రా దారులు లోకేష్ - చంద్రబాబు లే అనేది సీబీఐ వస్తే కానీ బయటపడదు అని అంటున్నారు. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డిని  ప్రకటించగానే వైఎస్ వివేకా హత్యకు బీజం పడింది అని వెల్లం పల్లి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: