" ఆయన్ని బెడ్ పక్కనే దాదాపు ఐదు సార్లు గొడ్డలితో నరికారు  .. నరికిన తరవాత తాను బాత్ రూమ్ లో రక్తం కక్కుకుని ఆ తరవాత బాత్ రూమ్ కి వెళ్లి అక్కడ రక్తం చూసుకుని కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు అని అర్ధం అవుతోంది.


ఈ పని చేసింది ఒకరు కాదు చాలా మంది ఉన్నారు. ఎత్తుకుని బెడ్ మీద నుంచి తీసుకెళ్ళారు. బాత్ రూమ్ లో కమోడ్ మీద రక్తం పోశారు ... కళ్ళు తిరిగేదాకా కొట్టారు .. కింద పడిపోయిన టైం లో కళ్ళు తిరిగి తల తగిలి పడిపోయేలా క్రియేట్ చేసారు .. యాక్ట్ ని ఎనాక్ట్ చేస్తూ కథ నడిపించారు. చంపించే హంతకుల సమక్షం లో లెటర్ రాస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా ?



ఒక లెటర్ ని కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. డ్రైవర్ మీద నెపం నెడుతున్నారు .. ఈ టోటల్ వ్యవహారం అంతా కొన్స్పిరసీ థియరీ పక్కకి పోయి ఒక సౌమ్యుడిని అన్యాయంగా చంపారు అనేది పోయింది .. టోటల్ గా వేరే పద్ధతిలో తీసుకుని పోయే కార్యక్రమం జరుగుతోంది. మాకు సీబీ ఐ ఎంక్వైరీ కావాలి .. నేను పోలీసుల ముందు మాట్లాడుతుంటే నే బోలెడు మంది ఫోన్ లు చేస్తూనే ఉన్నారు ..



వరసగా ఎస్పీ పక్కనే ఉండగా నాకు విషయం చెప్తుండగా ఏడీ  వెంకటేశ్వర రావు నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఏ స్థాయి లో మానిటర్ చేసి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చేసినవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా విషయం బయటకి రావాలి . ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా అన్నీ బయటకి రావాలి .



మొదట తాత ని చంపేశారు , ఆ తరవాత మా నాన్న ని చంపారు .. ఇప్పుడు ఇది జరిగింది .. మాకు సీబీఐ ఎంక్వైరీ కావాల్సిందే .. హత్య చేసిన వాళ్ళే వేరేవాళ్ళ మీద అరవడం అపహాస్యంగా ఉంది .. న్యాయం జరగాలి అంటే చంద్రబాబు చేతిలో రిపోర్ట్ చెయ్యని వ్యవస్థ తో ఎంక్వైరీ చెయ్యాల్సిందే " అన్నారు జగన్ తన ప్రెస్ మీట్ లో .


మరింత సమాచారం తెలుసుకోండి: