ఆశ్చర్యంగా ఉంది వినటానికే.  తాజాగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఎవరో పగపట్టినట్లుగా ఒకరి తర్వాత ఒకరిని కుట్ర చేసి మరీ హతం చేస్తున్నట్లుగా ఉంది. పదేళ్ళ క్రితం  వైఎస్సార్ మరణం.  మొన్న వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యాయత్నానికి కుట్ర. తాజాగా వివేకానందరెడ్డి హత్య. ముందు వివేకా గుండెపోటుతో మరణించారని అనుకున్నారు. అయ్యోపాపం అనుకున్నారు. తీరా చూస్తే హత్య చేశారని తేలిన తర్వాత అందరూ నివ్వెరపోతున్నారు.

 Image result for ysr death

నిజానికి వైఎస్ మరణం కూడా మిస్టరీనే. హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు వెళుతూ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ కూలిపోయేంత స్ధాయిలో వాతావరణంలో ప్రతికూలత లేదని కొందరు నిపుణులు చెప్పటంతో అప్పట్లో అదో పెద్ద సంచలనం. వైఎస్ ది కచ్చితంగా హత్యే అనటానికి ఎవరి దగ్గరా సరైన ఆధారాలు లేకపోయినా ప్రమాదమే అన్న విషయాన్ని మాత్రం ఎవరూ నమ్మలేదు. మొత్తానికి ఏం జరిగిందన్నది భగవంతుడికే తెలియాలి. ఏదేమైనా వైఎస్ మరణం మిస్టరీగా మారిపోయింది.

 Image result for ysr death

తర్వాత పోయిన ఏడాది పాదయాత్రలో ఉన్న జగన్  హైదరాబాద్ రావటానికి విశాఖపట్నం విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నపుడు హఠాత్తుగా శ్రీనివాస్ అనే నిందితుడు కత్తితో  దాడి చేశాడు. ఏదో అదృష్టం ఉండి జగన్ తప్పించుకున్నాడు. హత్యాయత్నం ఘటనపైన కూడా ఎన్నో అనుమానాలు. నిందితుడిని పట్టుకున్నా ఇంతవరకూ ఏ విషయమూ తేలలేదు.

 Image result for ys jagan attack

నిందితుడి బ్యాక్ గ్రౌండ్ చూస్తే జగన్ పై హత్యాయత్నం చేసేంత సీన్ లేదని ఎవరికైనా అర్ధమైపోతోంది. కానీ హత్యాయత్నానికి ప్లాన్ చేసిన సూత్రదారులెవరన్నదే తేలాలి. విచారణ నిమ్మితం చంద్రబాబు సిట్ వేశారు. సిట్ విచారణపై నమ్మకం లేదని జగన్ కోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ విచారణ మొదలైనా ప్రభుత్వం సహకరించటం లేదు. అందుకే తన హత్యకు చంద్రబాబు అండ్ కోనే ప్లాన్ చేశారని జగన్ ఆరోపిస్తున్నారు. అయితే ఆధారాలు మాత్రం లేవనే చెప్పాలి. సరే ఆ విచారణ ఎలా ముగుస్తుందో ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు.

 

ఇక తాజాగా వివేకా అంటే అజాతశతృవునే చెబుతారు. ఎవరితోను గొడవ పెట్టుకునే వ్యక్తికాదు. సాధుజీవి లాంటి వ్యక్తిని కత్తితో ఏడు పోట్లు పొడిచి చంపాల్సిన అవసరం ఎవరుకుంది ? తల నుండి పాదాల వరకూ చూస్తే మొత్తం ఏడుకత్తిపోట్లు ఉన్నాయి. అంటే వివేకాది హత్య అని తేలిపోయింది. ఎవరు చేశారు ? వివేకాను హత్యచేస్తే ఎవరికి లాభం అన్నదే తేలాలి ? ఈ ఘటనపైన కూడా ప్రభుత్వం సిట్ విచారణ ఏర్పాటు చేసస్తే వైసిపి సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. సరే విచారణలో ఏం తేలుతుందన్నది పక్కనపెడితే అసలు ఒక కుటుంబంపై ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికుంది ? అన్నదే వైఎస్ కుటుంబం అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: