వైఎస్ వివేకా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఆయన రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ పై కూడా హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. అసలు వివేకా పోస్టుమార్టం నివేదిక చూసినవారెవరూ ఆయన ఓ లేఖ రాశారంటే నమ్మే పరిస్థితి లేదు. 



ఆ లేఖలో ఏముందంటే.. నేను డ్రైవరును తొందరగా రమ్మన్నానని.. నన్ను చచ్చేలా కొట్టినాడు.. డ్రైవరు ప్రసాదును వదలొద్దు.. అని ఉంది. వాస్తవానికి వివేకాను గొడ్డలితో నరికిన తీరు చూస్తే.. ఆయన ఆ గాయాలతో ఈ లేఖ రాసే పరిస్థితి ఎంత మాత్రమూ లేదు. ఒక వేళ ఆ లేఖలో ఉంది నిజమే అనుకుందామనుకున్నా.. అక్కడి పరిస్థితి వేరే గా ఉంది.



వివేకా రాసిన లేఖ ప్రకారం డ్రైవర్ ప్రసాద్ ఆయన్ను తీవ్రంగా గాయపరిచి ఉంటే.. ఆయన పరారై ఉండాలి. లేదా.. పోలీసులకు లొంగిపోవాలి. కానీ నిన్నంతా  ప్రసాద్‌ వివేకా ఇంటివద్దే ఉన్నారు. అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ లేఖ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 



వివేకా హత్యపై ఉదయం నుంచి మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. కానీ వైఎస్ జగన్ చెప్పేవరకూ అసలు ఈ ఉదంతంలో ఓ లేఖ ఉందని ఏ మీడియా కూడా చెప్పలేదు. వైఎస్ జగన్ చెప్పిన తర్వాతనే పోలీసులు మీడియాకు లేఖ విషయం గురించి చెప్పారు. మరి అసలు ఈ లేఖ రాసిందెవరో పోలీసులే తేల్చాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: