విశాఖ రాజకీయాలే కాదు, ఉత్తరాంధ్రలోనూ గట్టి పేరున్న కుటుంబం ద్రోణం రాజుది ఆ కుటుంబం మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ వస్తోంది. అటువంటి కుటుంబం నుంచి రెండవ  తరంలో సీనియర్ నాయకునిగా ఉన్న ద్రోణం రాజు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సీనియర్ నేత ఉన్న ఆయన ఇపుడు షాకింగ్ డెసిషన్ తీసుకుంటున్నారు.


కాంగ్రెస్ పార్టీయే ద్రోణం అన్నంతగా కలసిపోయిన ఆ కుటుంబం ఇపుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ రోజురోజుకు దిగజారుతున్న వైనాన్ని గమనించి కాంగ్రెస్ కి గుడ్ బై కొడుతున్నారు. వైసీపీలో చేరేందుకు శ్రీనివాస్ రెడీ అవుతున్నారు. ఈ నెల 17న విశాఖ వస్తున్న జగన్ సమక్షంలో ద్రోణం రాజు పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.  విశాఖ సౌత్ సీటు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ద్రోణం రాజు వైసీపీలోకి వస్తే అక్కడ పార్టీ బలపడడం ఖాయం.  ఆయన అక్కడ నుంచి  వైసీపీ ఎమ్మెల్యే అభర్ధిగా పోటీ చేస్తారు. అంతే కాదు, టీడీపీ ఓటమికి కూడా ఇది నాంది అవుతుందని అంటున్నారు. 


ద్రోణం రాజు చేరికతో అటు బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు, ఇటు మత్సకారులు కూడా పార్టీ వైపు ఉంటారని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీద ఉన్న వ్యతిరేకత ఇపుడు వైసీపీకి బాగా ఉపయోగపడుతుంది. మొత్తానికి ఇది టీడీపీకి, కాంగ్రెస్ కి కూడా షాకింగ్ డెసిషనే అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: