వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రాత్రి మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. డెడ్ బాడీని చూశాక ఎందుకు.. ఈ విషయాన్ని దాచి పెట్టారు...  ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..? అని ప్రశ్నించారు.

vivekananda reddy murder కోసం చిత్ర ఫలితం


కుటుంబ సభ్యుడు చనిపోయినా.. సాక్ష్యాలు దాచే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. రక్తపుమరకలు ఎందుకు తుడిచేశారని సీఎం ప్రశ్నించారు. సొంత చిన్నాన్న చనిపోతే.. ఇలాగేనా వ్యవహరించేది..? అంటూ నిలదీశారు. చిన్నాన్న విషయంలోనే ఈ విధంగా వ్యవహరిస్తే.. మిగిలిన వారి విషయంలో ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. 
సంబంధిత చిత్రం

ఐతే.. సీఎం చంద్రబాబు చెబుతున్నది అవాస్తవం అంటున్నారు జగన్ వర్గీయులు.. జగన్ సొంత పత్రిక సాక్షిలో దీనిపై వివరణ ఇచ్చారు. అసలు జరిగిందేంటంటే.. వివేకా మృతి చెందారన్న విషయాన్ని ధృవీకరించుకున్న పీఏ కృష్ణారెడ్డి ముందుగా కుటుంబసభ్యులకు అక్కడి పరిస్థితిని వివరించారు. తర్వాత మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. 
సంబంధిత చిత్రం

నిర్జీవంగా పడి ఉన్న పెదనాన్నను చూసి నిర్ఘాంతపోయారు. శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. అప్పట్లో గాయాలు సైతం కన్పించని పరిస్థితి. గుండెపోటు సందర్భంగా రక్తపు వాంతుల కారణంగా అలా అయిపోయారని భావించారు. సీఐ శంకరయ్య వచ్చేవరకు ఎవరూ రక్త నమూనాలు చెరపలేదు.కుటుంబ సభ్యులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఇప్పటికీ బాత్‌రూంలో రక్త నమూనాలు అలాగే ఉన్నాయి. బాత్‌రూంకు పోలీసులే తాళం వేసుకుని వెళ్లారు. ఇదీ సాక్షి కథనం.. మరి ఎవరు చెప్పేది నిజం..? ఎవరు అబద్దం చెబుతున్నారు..? ఇవీ సామాన్యుడికి వచ్చే ప్రశ్నలు..



మరింత సమాచారం తెలుసుకోండి: