విశాఖ మీద జనసేనాని కన్నేశారు. ఇక్కడ ఆయన సామాజిక వర్గం సీట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఆయన ఇక్కడ పోటీకి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికైతే ఆయన  రెండు సీట్లు మీద గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. వాటిలో అయితే విజయం ఎలా ఉంటుందోనని ఆయన సర్వేలు చేయించుకుంటునట్లుగా చెబుతున్నారు. 


విశాఖ గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారని ఇప్పటి దాకా టాక్ వచ్చింది. అక్కడ కాపు సామాజికవర్గం బలంగా ఉండడంతో పాటు 2019 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఇక్కడ గెలిచింది. దాంతో మొదట ఇక్కడే అనుకున్నారు. అయితే లేటేస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి పోటీకి రెడీ అవుతున్నారట. ఇక్కడ మంత్రి గంటా విశాఖ నార్త్ కి షిఫ్ట్ కావడంతో పవన్ ఇటు వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.


అయితే ఇక్కడ వైసీపీకి బలమైన అభ్యర్ధిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు. మరి పవన్ కి ఇక్కడ ఎటువంటి కేడర్ లేదు. బలమైన నాయకులు కూడా లేరు. అయితే 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రజారాజ్యం విజయం సాధించింది. అప్పట్లో ఆ పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఈసారి ఏకంగా పవనే పోటీకి దిగితే జనం ఆదరిస్తారని భావిస్తున్నారు. పైగా ఇక్కడ కూడా కాపులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడో విషయం కూడా తెలుస్తోంది. కొంతమంది బిగ్ షాట్స్ కూడా తెర వెనక నుంచి పవన్ గెలుపునకు సహాయం చేస్తారని కచ్చితమైన సమాచారం అందడంతోనే పవన్ భీమిలీ అంటున్నారని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: