విశాఖ జిల్లా రాజకీయాల్లో కొన్ని కుటుంబాల మధ్య రాజకీయ వైరం కంటే వ్యక్తిగత వైరం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ కుటుంబాలు వేరు వేరు పార్టీలో ఉంటూనే తమ పాలిటిక్స్ ని కొనసాగిస్తూ వస్తున్నాయి. కొన్ని విచిత్రమైన పరిస్తితులలో మాత్రమే ఒకే పార్టీలో ఉన్నాయి. అయిన కూడా అక్కడ కూడా సఖ్యత లేదు. దాంతో వారికీ, పార్టీకి కూడా చేటు తెచ్చుకున్నారు.

ఇపుడు మళ్ళీ 2014 నాటి సీన్ విశాఖ జిల్లాలో రిపీట్ అవుతోంది. అప్పట్లో మాజీ మంత్రులు కొణతాల రామక్రిష్ణ, దాడి వీరభద్రరావు వైసీపీ గూటిలో  ఒకే పార్టీలో ఉండాల్సి వచ్చింది. ఈ ఇద్దరి మధ్యన ఉన్న విభేదాలు చివరికి ఆ  పార్టీ పుట్టె ముంచాయి. దాంతో ఫలితాలు వచ్చిన వెంటనే దాడి వైసీపీకి గుడ్ బై కొట్టారు. కొన్నాళ్ళకు కొణతాల కూడా వెల్లిపోయారు. ఇపుడు మళ్ళీ ఎన్నికల వేళ కొద్ది రోజుల క్రితమే దాడి కుటుంబం వైసీపీ కండువా కప్పుకుంది. ఇక్కడ అసలైన  ట్విస్ట్ ఏంటంటే రేపో మాపో కొణతాల మళ్లీ తన సొంత గూడు అయిన వైసీపీలోకి వస్తున్నారు. 


ఈ పరిణామాలతో దాడి కుటుంబం అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇప్పటికైతే దాడి ఫ్యామిలీకి జగన్ ఏ సీటు ఇవ్వలేదు. అనకాపల్లి  ఎంపీ నుంచి వీరభద్రరావుని పోటీ చేయమన్నా ఆయన ససేమిరా అన్నారు. దాంతో ఇపుడు కొణతాలను తెచ్చి ఎంపీ సీటు ఇస్తామని చెబుతున్నారు. అనకాపల్లి అసెంబ్లీ సీటు ఇప్పటికే గుడివాడ అమర్నాధ్ కి ఇచ్చేశారు. మరి దాడి కుటుంబానిక్ ఎక్కడ సీటు ఇస్తారో తెలియదు. ఇంకో వైపు దాడి కుటుంబం కొణతాల వస్తే తాము వైసీపీలో ఉండమని గట్టిగా  అంటోంది. మరి రేపు జగన్, చంద్రబాబు విశాఖ వస్తున్నారు. ఈ ఇద్దరి రాజకీయం ఏ వైపు అన్నది రేపే తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: