వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అందరూ ఊహించినట్లే తెలుగుదేశంపార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెతలాగ తయారైంది టిడిపి పరిస్ధితి. వివేకా హత్య కేసులో స్వయంగా చంద్రబాబునాయుడే వైఎస్ కుటుంబంపై అనుమానాలు వ్యక్తం చేస్తు ఆరోపణలు మొదలుపెట్టిన తర్వాత నేతలు ఊరకుంటారా ? ఇపుడు జరుగుతున్నది కూడా అదే.

 

హత్య ఘటనపై మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంఎల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎంఎల్సీ సతీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, వివేకా హత్యలో వైఎస్ కుటుంబం హస్తమే ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేయటం విచిత్రంగా ఉంది. చాలా కాలంగా వివేకానందరెడ్డికి, జగన్ కు పడటం లేదు కాబట్టి వైఎస్ కుటుబమే చేయించుండొచ్చంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. అందుకు సాక్ష్యాలుగా రక్తపు మరకలను తుడిచేయటం, వివేకా శరీరంపై వేలిముద్రలను తుడిచేయటం, ఘటనా స్ధలంలో ఆధారాలను చెరిపేయటం లాంటివి చేసినట్లు చెబుతున్నారు.

 

వివేకా పిఏ కృష్ణారెడ్డి చెప్పినదాని ప్రకారమైతే సిఐ వచ్చిన తర్వాత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ పోలీసులు వచ్చేలోగానే మృతదేహాన్ని ఆసుపత్రికి ఎందుకు తరలించారని చంద్రబాబు అడగుతున్నారు. ముందు గుండెపోటుతో మరణించారని చెప్పి తర్వాత హత్య చేశారని చెప్పటంపై కూడా చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 Image result for vivekananda murder

విగతజీవిగా వివేకాను చూసినపుడు హత్య చేసుంటారనే ఆలోచనే పిఏకి వచ్చుండదు. ఎందుకంటే ఆయనకెవరూ శతృవులు లేరు. గుండెపోటుతో రక్తం కక్కుకుని మరణించారనే అనుకుని ఉంటారు. అయితే వివేకాను దగ్గర నుండి చూసినపుడు శరీరంపై దెబ్బలున్నట్లు పిఏ గ్రహించారు. వెంటనే అదే విషయాన్ని పులివెందుల పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం పోస్టుమార్టమ్ తర్వాతే హత్యగా వైఎస్ కుటుంబం ఆరోపిస్తోందంటూ అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు. మొత్తానికి వివేకా హత్య తమపైకి రాకుండా చూసుకోవటంతో చంద్రబాబు అండ్ కో నానా అవస్తలు పడుతున్నది స్పష్టంగా తెలిసిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: