నెల్లూరు జిల్లాలో చంద్రబాబునాయుడు షాక్ తప్పేట్లు లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టికెట్ తీసుకున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ నేతలకు అందుబాటులో లేకుండాపోయారు. దాంతో ఆదాల టిడిపికి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం పెరిగిపోయింది.  శుక్రవారం మధ్యాహ్నం నుండి ఎవరు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అనే సమాధానం వస్తోందట. పైగా ఆయన ఇంటిముందున్న టిడిపి ఫ్లెక్సీలను కూడా తీసేశారట. దాంతో ఆదాల విషయంలో ఏం జరుగుతోందో టిడిపి నేతలకు అర్ధం కావటం లేదు.

 Image result for adala prabhakar reddy

ముందుగా ఆదాలను నెల్లూరు ఎంపిగా పోటీ చేయమని చంద్రబాబు ఒత్తిడి చేశారు. అయితే, ఆదాల ఒత్తిడికి లొంగలేదు. సరే తర్వాత చాలా నియోజకవర్గాలు తెరపైకి వచ్చి చివరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఖరారైంది. చంద్రబాబు ప్రకటించిన జాబితాలో రూరల్ నియోజకవర్గం టికెట్ ఆదాలకు ఖరారైంది. ఆ మేరకు శుక్రవారం ఉదయం ప్రచారం కూడా నిర్వహించిన ఆదాల మధ్యాహ్నం తర్వాత మాయమైపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 Image result for adala prabhakar reddy

ఆదాల టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరుతారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు అదంతా తప్పుడు ప్రచారమనే ఆదాల కొట్టేస్తున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రచారమే నిజమయ్యేట్లున్నాయి. ఎలాగంటే ఇంతకాలం ఆదాల టిడిపిలో ఉన్నది తన కాంట్రాక్టుల తాలూకు బిల్లుల కోసమే అని బయటపడింది. దాదాపు రూ 50 కోట్ల బిల్లులు ఆగిపోయాయట.

 Image result for adala prabhakar reddy

మొదటిజాబితాలో టికెట్ ప్రకటించిన రాత్రే చంద్రబాబుతో ఆదాల భేటీ అయ్యారట. ఆర్ధికశాఖ ఉన్నతాధికారులకు చెప్పించుకుని బిల్లులన్నీ పాస్ చేయించుకున్నారని సమాచారం. శుక్రవారం ఉదయమే అధికారులను కలిసి తన బిల్లుల తాలూకు చెక్ లు అందుకున్నారు.  వాటిని బ్యాంకుల్లో జమచేసి నెల్లూరుకు వెళ్ళిపోయారు. బ్యాంకుల్లో జమైన చెక్ లన్నీ క్యాష్ అయినట్లు బ్యాంకు నుండి మధ్యాహ్నంపైన ఆదాలకు మొబైల్ కు  మెసేజ్ వచ్చిందట.

 Image result for adala prabhakar reddy

ఎప్పుడైతే మెసేజ్ అందుకున్నారో అప్పటి నుండే ప్రచారంలో నుండి మాయమైపోయారు. దీనిబట్టి అర్ధమవుతున్నదేమంటే ఆదాల ఇంతకాలం టిడిపిలో ఉన్నది కేవలం బిల్లుల కోసమే అని. విషయం తెలిసి చంద్రబాబు షాక్ కు గురియ్యారట.


మరింత సమాచారం తెలుసుకోండి: