అనంతపూర్ జిల్లా లో అందరిని ఆకర్షిస్తున్న నియోజక వర్గాల్లో రాప్తాడు ఒకటీ .2009 లో తొలిసారి ఎన్నికలు జరిగిన ఈ నియోజకవర్గం లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన పరిటాల సునీత కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై కేవలం 1700 ఓట్ల తో గెలుపొందారు. ఇక 2014 లో ప్రకాష్ రెడీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా టీడీపీ నుంచి మళ్లీ సునీత తన ఆధిక్యత ను పెంచుకొని దాదాపు 8 వేల ఓట్ల తో గెలుపొందారు. దీంతో మరో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని సునీత, ఎలాగైనా విజయం సాధించి అసెంబ్లీ లో అడుగు పెట్టాలని ప్రకాష్ రెడ్డి భావించడం తో ఇక్కడ రాజకీయం ఆసక్తికరం గా మారింది. 2009 నుంచి వరుసగా రెండసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన సునీత ప్రజలకు ఎప్పుడు దగ్గర గానే ఉంటారు అయితే మంత్రి గా ఎన్నికైన తర్వాత దూరమాయారని వాదన కూడా లేకపోలేదు. ఇక వరుస గా రెండు సార్లు ఓడిన ప్రకాష్ రెడ్డి కి నియోజకవర్గం లో పట్టు మాత్రం తగ్గలేదు.అయితే చివరి నిమిషంలో అభ్యర్థులు మారిన ఆశ్చర్య పొనక్కర్లేదు.ఎందుకు అంటే పరిటాల సునీత తన తనయుడు అయిన పరిటాల శ్రీరాం ను బరి లో దించే ప్లాన్ లో ఉన్నారు.ఇటు వైపు వైఎస్సీపీ నుంచి ప్రకాష్ రెడ్డి దాదాపు ఖరారు అయిపోయినట్టే.ప్రధాన పోటీ మాత్రం అధికార, విపక్ష లా మధ్యే ఉండే అవకాశం ఉంది. దీంతో ఇద్దరు నేతలు ఇప్పటి నుంచి పట్టు పెంచుకొని విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: