సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి .దీనినీ తండ్రి చాటు నియోజకవర్గం అని కూడా అంటూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ సీనియర్ నేత అయిన తలారీ మనోహర్ కొడుకు తలారి ఆదిత్య ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. తండ్రి ఎది చెబితే అది చేయడం అతని పని అయిపొయింది. ఒక విధంగా ఆదిత్య ఫెయిల్యూర్ లిస్ట్ లో చేరిపోయారు. ఈ నియోజకవర్గం లో అవినీతి తాండవం చేస్తుంది అని ప్రజల చెబుతున్నారు. ఏ పని జరగాలన్నా ఆదిత్య అనుచరుల చెయ్యి తడపాల్సిందే అంట. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఎమ్మెల్యే గా ఎంపిక కావడం అనేది కష్టమే మరి. ఇటు వైఎస్సార్సీపీ పార్టీ నుంచి ఈ సారి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ నుంచి ఆదిమూలం పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ బలహీనంగా కనిపిస్తుంది. వైఎస్సార్సీపీ మంచి ప్రణాళిక తో ముందడుగు వేస్తే గెలుపు సులభతరం అవుతుంది. క్రితం ఎన్నికల్లో కూడా స్వల్ప మెజారిటీ తో వైఎస్సార్సీపీ ఇక్కడ పట్టు కోల్పోయింది. కేవలం 4227 ఓట్ల తో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. కాబట్టి ఇరు పార్టీ లకు గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: