కొన్ని కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీ లకు కొంచుకోటలు గా నిలుస్తూ ఉంటాయి. కానీ పీలేరు నియోజకవర్గం అన్ని కంటే కాస్త భిన్నం.ఇక్కడి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో చెప్పటం కష్టం. టీడీపీ పార్టీ మాత్రం ఇక్కడ ఒక్కసారి కూడా తన పసుపు జెండాను ఎగుర వేయలేకపోయింది. 2014 లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఇక్బాల్ వైఎస్సార్సీపీ పార్టీ లో చేరిపోయి చంద్రబాబు కి షాక్ ఇచ్చారు. అయినా ఆయనకు వైఎస్సార్సీపీ పార్టీ నుంచి టికెట్ మాత్రం లభించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న చింతల రామచంద్ర రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ తరుపున పోటీ లోకి దిగారు. టీడీపీ పార్టీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి పార్టీ టికెట్ ఖరారు చేశారు. 2009 లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుమార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. కాకపోతే నల్లారి కుటుంబ లో వీరిద్దరి మధ్య ఏవో గొడవలు నడుస్తున్నాయి అని సమాచారం. పాతికెళ్ళు గా టీడీపీ పార్టీ లో ఉన్న ఇక్బాల్ అహ్మెద్ ,ఆయన కు నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కకపోయేసరికి ఆ పార్టీ గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీ లో చేరిపోయారు ఈ పరిణామం టీడీపీ పార్టీ కి దెబ్బ గా మారిపోయింది. ఏది ఏమైనా ఇక్కడ రాజకీయ వాతావరణం హై టెన్షన్ గా మారింది. వైఎస్సార్సీపీ తమదే పై చేయి అని ఊపుతో ఉంటే, ఈ సారి ఎమ్మెల్యే పదవి ని వదులుకొబోము అని టీడీపీ ఊరకలు వేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: