కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పీడ్ పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలైంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఎలాగైనా మోదీని గద్దె దించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నియంతృత్వ పాలనను సాగనంపాలని పిలుపునిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు.

Image result for rahul gandhi

దేశవ్యాప్తంగా నిన్నమొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేవాళ్లే లేరు. అయితే ఇప్పుడు బీజేయేతర పార్టీల్లో చాలా వరకూ కాంగ్రెస్ వెన్నంటి ఉన్నాయి. మోదీ నియంతృత్వ పోకడలు నశించాలంటూ మమత బెనర్జీ, చంద్రబాబు, స్టాలిన్, ఫరూఖ్, మాయావతి, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి .. తదితరులంతా పిలుపునిస్తున్నారు. అంతేకాక మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో పోరాడేందుకు కూడా ముందుకొచ్చారు. దేశవ్యాప్తంగా లపు ప్రాంతాల్లో ఉమ్మడిగా సభలు కూడా నిర్వహించారు.

Image result for rahul gandhi

దేశవ్యాప్తంగా పలు ప్రధాన పార్టీలు తమ వెంట నడిచేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్ పార్టీకి తమపై విశ్వాసం పెరిగింది. దీంతో దూకుడు పెంచింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ.. మోదీని టార్గెట్ గా చేసుకుని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రఫేల్ స్కామ్ లో మోదీయే ప్రధాన సూత్రధారి అని, అనిల్ అంబానీకి మేలు చేసేందుకే రఫేల్ స్కామ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో భారత సైన్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.

Image result for congress party

ఇక ఎన్నికల సమయం సమీపించడంతో అభ్యర్థుల ఎంపిక, విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై రాహుల్ దృష్టి పెట్టారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఇది పార్టీకి మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇదే ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలని రాహుల్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాల్లో తమతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పొత్తు ఖరారైంది.

Image result for congress party

ఇక రాహుల్ కూడా ఈసారి అమేథీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఓ స్థానం నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో మోదీ కూడా రెండు సీట్లలో పోటీ చేశారు. ఇప్పుడు రాహుల్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. దక్షిణాదిలో పోటీ చేయాలనుకుంటే కర్నాటక నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది దక్షిణాదిలో పార్టీకి బూస్టప్ ఇస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి రాహుల్ మాత్రం స్పీడ్ పెంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: