Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:21 am IST

Menu &Sections

Search

జగన్ మొర గవర్నర్ అయినా వినేనా..?

జగన్ మొర గవర్నర్ అయినా వినేనా..?
జగన్ మొర గవర్నర్ అయినా వినేనా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌తో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా  తీసుకెళ్లారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వివేకానంద హత్య కేసులో నిజాలు బయటికి రావాలంటే సీబీఐకి అప్పగించాలని అన్నారు. చంద్రబాబు హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు రిపోర్టు చేయని వ్యవస్థతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని ఆరోపించారు. వైఎస్ వివేకానంద హత్యకేసులో న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేశారు.

telugu-states-governor-narasimhan-ys-jagan-ys-veve

గవర్నర్ కలిసి చిన్నాన్న విషయంలో జరిగిన దారుణాన్ని వివరించామని జ‌గ‌న్ తెలిపారు. తాము అక్క‌డే ఉన్న స‌మ‌యంలోనే ఎస్‌పీకి అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని జ‌గ‌న్ తెలిపారు.  ఇంటెలిజెన్స్ డిపార్టెంట్‌ను టీడీపీకి వాచ్‌మ‌న్‌ కన్నా దారుణంగా తయారు చేశారని మండిప‌డ్డారు. 23 మంది ఎమ్మెల్యేలను అడిషనల్ డీజీ వెంకటేశ్వర రావు మాట్లాడి టీడీపీలో చేర్పించారని ఆరోపించారు.  తాము సీబీఐ విచార‌ణ కోరుతున్నామ‌ని తెలిపారు. ``నేను చంద్రబాబు ను ఒకే ప్రశ్న అడుగుతున్నాను. సీబీఐ ఎంక్విరీ కి ఇస్తే మీకు ఏమిటి నష్టం? ఎన్నికలు అయ్యే వరకు వెంకటేశ్వర రావు లాంటి నాయకుల ను తప్పించాలని కోరుతున్నాం. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొక పోతే మేము కోర్టు కూడా వెళతాం. రెండు మూడు రోజుల్లో కోర్ట్ కూడా వెళ్ల‌నున్నాం`` అని వెల్ల‌డించారు. 

telugu-states-governor-narasimhan-ys-jagan-ys-veve

``గతంలో మా తాతను వైయస్ రాజారెడ్డిని చంపారు. నాన్నను కట్టడి చేసేందుకు రిటైర్డ్ అయిపోయి ఉన్న ముసలాయనను చంపారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ప్రతిపక్ష నేత తండ్రిని చంపారు. ముఖ్మమంత్రి ఎవరు? చంద్రబాబు. తర్వాత మా నాన్నను. అసెంబ్లీలో నాన్న చనిపోక ముందు రెండు రోజుల ముందు చంద్రబాబు నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు థ్రెట్ చేశారు. తర్వాత రెండు రోజులకే హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకీ మాకు అనుమానాలు ఉన్నాయ్. ఆరోపణలు ఉన్న వ్యక్తి చంద్రబాబు. నామీద కూడా హత్యాయత్నం జరిగింది. మోస్ట్ సెక్యూర్ట్ ప్లేస్ ఎయిర్ పోర్టు. అక్కడకు కత్తి రాగలిగింది. టీడీపీ నేతల రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి కత్తి తీసుకొని నా మీదకు రాగలిగాడు. కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంతగా దిగజారారు. ప్రతి వేలు చంద్రబాబు వైపు చూపిస్తుంటే ఎంక్వైరీ తనే చేస్తానని చంద్రబాబు చెప్పటం ఏంటి? అలాంటప్పుడు న్యాయం జరుగుతుందా?`` అని సూటిగా ప్ర‌శ్నించారు. 


చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జ‌గ‌న్ అన్నారు. ``సహజంగా చిన్నాన్న లాంటి లీడర్లకు సెక్యూరిటీ ఇవ్వాలి. అయితే ఎందుకు ఇవ్వలేదు. సహజంగా ఎస్పీలు నియమించాక రెండు ఏళ్లు ఉంచాలి. 40 రోజుల క్రితం ఉన్న ఎస్పీని బదలాయించి ఈ ఎస్పీని తెచ్చారు. ఎస్పీ నిన్న ఓ లేఖ చూపించారు. అందులో చిన్నాన్న తన డ్రైవర్ చంపారని ఫ్యాబ్రికేటెడ్ లేఖ సృష్టించారు. ఆయన గుండెపోటు వచ్చి కప్ బోర్డుకు తగిలి చనిపోయినట్లు ఆయన బాడీని పెట్టారు. ఇంట్లో ఎవ్వరూలేరు. ఆయన ఒక్కరే ఉన్నారు. వీరు చంపుతా ఉన్నా.. చిన్నాన్న లేఖ రాస్తారా? డీఐజీ, ఎస్పీ ఓ లేఖ చూపిస్తున్నారు. వాస్తవాలు కప్పిపుచ్చేందుకు సినిమా కథలు చెబుతున్నారు. చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాన్న. ఎలా చనిపోయారు. దీంట్లో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐకి ఎందుకు ఇవ్వటం లేదు. సమాధానాలు రావటం లేదు`అని వైయస్ జగన్ అన్నారు.


telugu-states-governor-narasimhan-ys-jagan-ys-veve
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు పోలీసుల‌ ఫైన్!
మోదీని ఉక్కిరిబిక్కిరి చేసేలా రాహుల్ ఎత్తులు
ఆయ‌న చెప్పిన ఒక్క మాట‌...కేసీఆర్ ఒత్తిడిని త‌గ్గించేలా ఉందే
సామాన్యుడికి కేసీఆర్ షాక్..పోలీసుల‌కు ఫిర్యాదు
క‌శ్మీర్‌లో ఏం మార్పు వ‌చ్చిందో తెలుసా మీకు?
ఆర్టీసీపై కేసీఆర్ ఉక్కుపాదం...ఆయ‌న‌కు షాకిచ్చింది ఎవ‌రో తెలుసా?
మోదీ మేన‌మామ మ‌రో మోసం..ఇంకో బ్యాంక్‌కు టోపీ
రాజీవ్ గాంధీపై తీవ్ర విమ‌ర్శ‌లు...ఆమెకు కాంగ్రెస్ ఆహ్వానం
ఆ రెండు దేశాల శాంతి మంత్రం...భార‌త్‌కు పెద్ద రిలీఫ్‌
ఆర్టీసీ కార్మికుల‌ గుండాగిరీ...కేసీఆర్ అనూహ్య వ్యాఖ్య‌లు
అధికారంలోకి వ‌స్తే కిచెన్‌లో వంట చేస్తారా...పెద్దాయ‌న కామెడీ
పేకాట‌లో గొడ‌వ‌...అమెరికాలో మ‌ళ్లీ తుపాకుల మోత‌...
డ‌బ్బుల‌తో మెడిక‌ల్ సీటు సంపాదించ‌డం ఎంత ఈజీయో నిరూపించారు
క‌శ్మీర్ గురించి ఈ ముఖ్య‌మైన స‌మాచారం మీకు తెలుసా?
మోదీ ఈ నిర్ణ‌యం తీసుకుంటే..ఇమ్రాన్ బుక్క‌యిన‌ట్లే...
తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌ళ్లీ ట‌చ్ చేసిన కేసీఆర్‌
మ‌హారాష్ట్ర, హ‌ర్యాన‌ ఎన్నిక‌లు...బీజేపీ డ‌బ్బుల వ‌ర‌ద
మేఘాపై రెండో రోజూ ఐటీ సోదాలు..భ‌ద్ర‌త కోసం పోలీసులు
డైటింగ్ చేస్తున్నారా...ఈ షాకింగ్ వార్త‌ తెలుసుకోండి
మోదీకి జిన్‌పింగ్ ఫిదా...అందుకే కీల‌క ప్ర‌క‌ట‌న‌
ఒక్కో వ్య‌క్తికి 10,000... గ‌ర్భిణీల‌కు కూడా పెన్ష‌న్‌...ఓట్ల వేట‌లో ఆ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
ఆ జిల్లాను అదిరిపోయేలా అభివృద్ధి చేస్తున్నామంటున్న కేటీఆర్‌
మ‌న్మోహ‌న్‌...ఈ ప‌ని చేస్తే చ‌రిత్ర‌లో నిలిచిపోతారు కానీ...
మ‌త పిచ్చిగాళ్ల‌కు ఆ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్‌...తాను ఆ ప‌నిచేయ‌న‌ని ప్ర‌క‌ట‌న‌
చైనా అధ్య‌క్షుడిని ఫిదా చేసేలా ఆ నిర్ణ‌యం తీసుకున్న మోదీ
మోదీ-చైనా అధ్య‌క్షుడి భేటీలో అంతా ఓకే కానీ...ఆ ఒక్క విష‌య‌మే డౌట్‌
బ్యాంకుల సంగ‌తి అంతే....ఆర్టీఐలో సంచ‌ల‌న నిజాలు..
శివ‌సేన‌కు ఊహించ‌ని షాక్‌...ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఓడించ‌నున్న బీజేపీ
స‌ర్కారీ ఉద్యోగుల మ‌న‌సు గెలుచుకునే ప‌థ‌కం ప్ర‌క‌టించిన కేసీఆర్‌
చెత్త‌తో బ్రేక్‌ఫాస్ట్‌...ఇదేం ఆలోచ‌నో....
రూ.740కోట్ల నిధుల మాయ‌...దేశంలో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్తకు బేడీలు
బ్రేకింగ్ఃజ‌గన్ ఢిల్లీ టూర్ ర‌ద్దు...అమిత్‌షా కీల‌క నిర్ణ‌యం
16 ఏళ్ల అమ్మాయికి నోబెల్‌..ఎందుకు ద‌క్కుతుందో తెలుసా?
హ‌రిద్వార్‌లో ప‌వ‌న్‌...హ‌ఠాత్తుగా ఎందుకంటే....
ఆ విద్యార్థిని కొట్టిన వ్య‌క్తికి టికెట్‌....బీజేపీ-కాంగ్రెస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఆంధ్రా-తెలంగాణ దోస్తీలో కొత్త కోణం...హోం శాఖ ఏం చేస్తుంది ఇప్పుడు?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.