ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే తాము ఆ అభివృద్ధి చేశాం...ఇది చేశామని చెబుతూ అధికార పార్టీ ఓట్లు అడుగుతుంటే....అధికార పార్టీ ఏమి చేయలేదు తాము వస్తే అన్నీ చేస్తామని ప్రతిపక్ష పార్టీ ఓట్లు అడుగుతుంది. ఇక వీటిల్లో ఏ మేరే నిజం ఉండి బేరీజు వేసుకుని ఓట్లు వేసేందుకు ప్రజలు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇది అన్నీ పార్టీలు ఎన్నికల సమయంలో చేస్తాయి కానీ... ఈ సారి ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ పార్టీ సరికొత్త వ్యూహాన్ని తీసుకున్నాయి. ఆ నేత మా పార్టీలోకి వస్తున్నాడు...ఈ నేత పార్టీలోకి వస్తున్నాడు అంటూ మైండ్ గేమ్ ఆదేస్తున్నారు. ఇక మైండ్ గేమ్‌ని ఆచంట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పితాని సత్యనారాయణపై కూడా ప్రయోగించారు. ఆయన ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. 


అసలు నేను పార్టీ మారాను అని మీడియాతో మొర పెట్టుకున్నారు. అయిన అవతల పార్టీ మైండ్ గేమ్ ఆపిందా అంటే లేదు... వరుసగా సొంత మీడియాలో ప్రచారం చేయించింది.. దీంతో మళ్ళీ మంత్రి మీడియా ముందుకి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా పితానిని వైసీపీ వీక్ చేద్దాం అనుకుంది కానీ పితాని దానికి లొంగకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సారి కూడా గెలుపు నాదే అని ధీమతో ఆయన ముందుకు వెళుతున్నారు. 2014లో 4వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన పితాని 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కార్మిక శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. కార్మికుల‌కు అత్యంత కీల‌క‌మైన చంద్ర‌న్న బీమా విస్తృతంగా ప్ర‌చారం చేయించారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లను ఆహ్వానించారు. ఇక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే చేశారు. ఇక పితానిపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి.  


ఆక్వా చెరువులకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం వల్ల అక్కడి సాగు, తాగునీరు కలుషితమైపోయిందని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కడా సరైన బస్టాండ్‌గానీ, సులభ్‌ కాంప్లెక్స్‌ గానీ లేవనే విమర్శలు వచ్చాయి. మరి ఈ సారి పితానికి వైసీపీ నుండి గట్టి ఎదురుకానుంది. వైసీపీ నుండి రంగనాథ్ రాజ్ పోటీ చేయనున్నారు. ఆర్ధికంగా బలమైన నేత కావడంతో టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పోగొట్టుకున్న ఆచంటని ఈ సారి ఎలా అయిన దక్కించుకోవాలి అనుకుంటున్నారు. అన్నీ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ చివరికి మైండ్ గేమ్ ఆడి పితాని విజయాన్ని ఆపాలని చూస్తున్నారు. ఇక రాష్ట్రంలో జగన్‌కి బలం పెరగటం వైసీపీకి కలిసొచ్చే అవకాశం ఉంది.


కాగా, ఇక్కడ గౌడ, శెట్టిబలిజ 52 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరే గెలుపుని డిసైడ్ చేస్తారు. అలాగే ఎస్సీ 23 వేలు, కాపు 22 వేలు, రెడ్డి 13 వేలు, మాదిగ 12 వేలు, క్షత్రియ 6 వేలు, కమ్మ 6 వేలు వరకు ఉన్నారు. ఇక రజక, బ్రాహ్మణ ,  వైశ్యులు, నాయీ బ్రాహ్మణులు కూడా బాగానే ఉన్నారు. మరి ఈ సారి విజయం ఎవరివైపు ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: