వైసీపీ అధినేత జగన్ చెప్పింది చేస్తారు అన్న మాట ఉంది. ఆయన ఏదైనా అన్నారో అది ఆచరిస్తారు. ఇక రాజకీయంగా కొత్త ముఖాలను కూడా జగన్ పరిచయం చేయడమే కాదు, వారికి టికెట్లు ఇచ్చి గెలిపించడంలోనూ అందరి కన్నా ముందున్నారు. గతసారి జగన్ చాలా మంది మహిళకు ఉన్నతమైన పదవులు దక్కేలా చూశారు.


ఇక జగన్ నిన్న ప్రకటించిన తొలి జాబితాలో పేర్లు చూసుకుంటే విశాఖ అరకు పార్లమెంట్ కు గొడ్డేటి మాధవిని ఎంపిక చేశారు.  ఆమె గతంలో చింతపల్లి ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో మన్ననలు అందుకున్న దేముడు కుమార్తె. ఆ కుటుంబం పట్ల గిరిజనుల్లో ఎంతో అభిమానం ఉంది, వారి సేవలను గుర్తుచేసుకుంటారు. గిరిజన సమస్యలపై చాలా రోజులుగా అమె పోరాటం చేస్తూ వచ్చారు. పార్టీని అక్కడ బాగానే నిలబెట్టిన మాధవి పేరు మొదటి నుంచి వినిపిస్తూనే  ఉంది. అయితే మధ్యలో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుకి టికెట్ ఇస్తారని భావించారు. కానీ చివరికి మాధవికి ఖరారు అయింది.  ఇదిలా ఉండగా ఇక్కడ ఓ సారూప్యం ఉంది. 2014 ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున రాజకీయాలకు కొత్త అయిన కొత్తపల్లి గీత పోటీ చేశారు.

అప్పట్లో టీడీపీ తరఫున రాజకీయంగా పేరున్న గుమ్మడి సంధ్య, కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ పోటీ పడ్డారు. చిత్రంగా గీత మంచి మెజారిటీతో గెలిచారు. కిషోర్ చంద్రదేవ్ మూడవ స్థానానికి పడిపోయారు. ఇపుడు కిషోర్ టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. వైసీపీ  తరఫున మాధవి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా మహిళనే మళ్ళీ పోటీకి దింపి గెలుపు బాటలు జగన్ వేశారని అంటున్నారు. గత ఎన్నికల ఫలితమే రిపీట్ అవుతుందని కూడా చెబుతున్నారు. గిరిజనులతో నిత్యం సంబంధాలు కలిగి ఉన్న మాధవి వైసీపీ తరఫున ఉంటే డిల్లీలో రాజకీయాలు చేస్తూ వచ్చిన కిషోర్ ఎన్నికల వేళ మాత్రమే కనిపిస్తారని విమర్శలు ఉన్నాయి. సో 2014 మాజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: