రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. కానీ హత్యలు కూడా ఉంటాయి. రాజకీయంగా హై హాండ్ కోసం హత్యలు జరుగుతుంటాయి. ఎంత కాదనుకున్నా, ఎన్నాళ్ళు అభివ్రుధ్ధి అంటూ ముందుకు వచ్చినా కూడా జరుగుతున్నవి జరుగుతూనే ఉన్నాయి.


రాయలసీమలో కడప అంటే వైఎస్సార్ కుటుంబాన్నే చెప్పుకుంటారు. ఆ కుటుంబాన్ని కడప అక్కున చేరుకుంటే వారిని కడుపులో పెట్టుంది ఆ ఫ్యామిలి. అటువంటి కుటుంబంలో ప్రముఖులంతా కత్తికి బలైపోవడం దారుణమే. రెండు దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని ఫ్రాక్షన్ వెంటాడుతూనే ఉంది. జగన్ తాత రాజారెడ్డి తో మొదలు, మొన్న వివేకాందరెడ్డి. ఈ హత్యలు ఎంత ముందుకు వచ్చాయంటే ఎక్కడో ఇడుపుల పాయ పొలాల్లో రాజారెడ్డి హత్యకు గురి అయితే, ఇపుడు ఏకంగా జగన్ చిన్నాన్న సొంత ఇంట్లో బెడ్ రూంలోనే కత్తికి బలైపోయారు. ఇది ప్రత్యర్ధులు సాధించిన విజయంగా చూడాలా, లేక ఫ్రాక్షన్ పడగ సాచిందనుకోవాలా.


ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఎంత ఉందో వైసీపీ వైఫల్యం కూడా అంతే ఉంది. కడపలో ఫ్రాక్షన్ రాజకీయం ఉందని వైసీపీకి తెలియనిది కాదు. పైగా జమ్మలమడుగు అంటేనే జంట హత్య కేసులు గుర్తుకు వస్తాయి. అక్కడ కడప ఎంపీ అవినాష్  రెడ్డిని ప్రచారానికి కూడా ఓ వర్గం రానీయడంలేదు. ఈ టైంలో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి అక్కడకు వెళ్ళి ప్రచారం చేసి రావడం జరిగింది. ఆయనకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేదు. మరి ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు. 


ఈసారు చావో రేవో అన్నట్లుగా టీడీపీ కడప కోసం సర్వం ఒడ్డుతోంది. జగన్ని సొంత నేల మీద కట్టడి చేయాలన్నది టీడీపీ ప్లాన్. మరి దాన్ని ఎదుర్కొనేందుకు వైసెపీ ఏం చేసింది. ఏ వ్యూహం లేకుండా చతికిలపడబట్టే భారీ మూల్యం చెల్లించుకుంది. కడపలో వివేకాను హత్య చేయడం ద్వారా ప్రత్యర్ధులు గట్టి సందేశం పంపించారు. జగన్ బాబాయికే రక్షణ లేదు, ఇక వైసీపీ క్యాడర్ ఏపాటి అన్నది ఆ సందేశం. మరి ఇది కానీ క్యాడర్ పట్టించుకుంటే రేపు వైసీపీకి కడపలో జెండా పట్టుకునే కార్యకర్త దొరుకుతారా. ఏది ఏమైనా ఎన్నికల వేళ వైసీపీ అధినాయకత్వం దారుణంగా విఫలమైంది. కడపలో హై హాండ్ కోసం జరుగుతున్న పోరాటంలో ఇప్పటికైతే ఓడింది. మరి ఎన్నికలు అక్కడ సాఫీగా జరుగుతాయా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: