రైల్వేకోడూరును  1962 లో అసెంబ్లీ సెగ్మెంట్ గా మార్చారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మరియు ఇండిపెండెంట్లు హవా ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ ఆవిర్భావం తరవాత పరిస్థితులు మారిపోయాయి. 1983 -2004 వరకు వరుసగా ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో 2004, 2009 లో గెలుపు కాంగ్రెస్ వశం అయ్యింది. వైఎస్ మరణానంతరం ఉపఎన్నికల్లోనూ మరియు 2014 లో వైసీపీ  కొరముట్ల శ్రీనివాసులు విజయం సాధించారు. ఈయన పై పోటీ చేసిన టీడీపీ నేత ఓబిలి సుబ్బరామయ్య కేవలం 1,972 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి పార్టీ టికెట్ ఆయనకి ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇక్కడ మంచి బలంగా ఉన్న పార్టీగా కనిస్తున్న జనసేన పార్టీ నుంచి డా.బోనాసి వెంకటసుబ్బయ్య బరిలో దిగబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ నిర్వహించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి ఆ పార్టీ కూడా విజయావకశాలు మెండుగానే ఉంటాయి అని  విశ్లేషకులు చెప్తున్నారు. ఇక అభివృధి విషయానికి సంబంధించి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు మాత్రం అధికార పార్టీ నుంచి స్పందన సారిగా లేదని అయిన తన మేరకు అభివృద్ధి సాధించామని చెప్పుకొస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఆయన మాటల్ని కొట్టి పారేస్తూ అభివృద్ధి టీడీపీ పార్టీతోనే సాధ్యం అని చెప్తూ ప్రజల్లో తమ ప్రచారాన్ని మొదలు పెట్టారు. కానీ అక్కడ ప్రజలు ఎవరికి సీటు కట్టపెడతారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: