కర్నూల్ జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో కోడుమూరు ఒకటి. ఇక్కడి నుండి మనిగాంధి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన ఆయన బీజేపీ అభ్యర్థి రేణుకమ్మ పై విజయం సాధించారు. అనంతరం ఆయన టీడీపీలో చేరిపోయారు. అయితే ఈసారి ఆయనుకు టికెట్ రాకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. మరో వైపు కోడుమూరు తమ సిట్టింగ్ స్థానంగా భావిస్తున్న వైసీపీ మరోసారి తమ పాగా వేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి పోరు పై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ 8 సార్లు గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మనిగాంధి పై అసమ్మతి గాలులు వీస్తున్నాయి. ఇటు వైసీపీ నుంచి కూడా పోటీ తీవ్రంగా ఉంది. అయితే వైసీపీ అధినేత ఈ నియోజకవర్గం నుంచి సుధాకర్ బాబును  పోటీలో నిలబెడుతునట్టు ఈ రోజు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కి బలమైన క్యాడర్ ఉంది. ఆయన ఎక్కడ మొగ్గు చూపితే వారిదే విజయం అనే వాదన కూడా ఉంది. ఆయన ఇటివలే టీడీపీ లో చేరారు. ఆ కార్యక్రమం కూడా ఇదే నియోజకవర్గంలోనే జరిగింది. అదే విధంగా వైసీపీకి కూడా కర్నూల్ జిల్లాలో బలంగా ఉంది. గత ఎన్నికల్లోనూ వైసీపీనే గెలిచింది. మరోసారి ఆ పార్టీ సత్తా చాటాలని భావిస్తుంది. ఇక జనసేన కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టలని కసరత్తులు చేస్తోంది. దీంతో ఇక్కడ పోరు తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: