పూతలపట్టు నియోజకవర్గంలో సీట్ల గండం ఆయా పార్టీల అభ్యర్థులకు కునుకు లేకుండా చేస్తుంది. దాదాపు అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ రెండు పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది..అయితే ఈ ఉత్కంఠను తెర తీస్తూ వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెస్ బాబు ను రంగంలోకి దించబోతున్నరు. అయితే టీడీపీ నుంచి మాత్రం ఇంకా ఏటువంటి సమాచారం లేదు. కానీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన లలిత కుమారి కి కూడా ఈ సారి టికెట్ లేనట్టే అని చెప్తున్నారు. గెలుపు గుర్రాల కోసం వెతుకుతున్న టీడీపీ కూడా ఈసారి కొత్త అభ్యర్తిని రంగంలోకి దించనున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన డా.రవి టీడీపీ లో చేరి టికెట్ ఆశిస్తున్నా ఆయన పట్ల సైతం పార్టీ అధినేత చంద్రబాబు అంత సంతృప్తిగా లేరని సమాచారం. టికెట్ ఎవ్వరికీ ఇవ్వాలని దాని పై రెండుసార్లు సమీక్షలు జరిపినా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో ఆశవాహల్లో హై టెన్షన్ మొదలైంది. రెండు పార్టీల నుంచి కొత్త మూఖాలు బరిలోకి దిగితే పాత కాపులు ఏంచేస్తారో అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు అటు పార్టీలు ఇటు పాత కాపులు తమతమ ఏర్పాట్లలో తలమునకలు అవుతున్నారు. మొత్తం మీద పూతలపట్టు పై ఎన్నికల ముందు ఆ తరువాత పట్టు ఎవరిది అనేది చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: