చిత్తూర్ జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా మారిన తంబళ్ళపల్లే నియోజకవర్గంలో రసవత్తర రాజకీయ పోరు నెలకొంది. వైసీపీ, టీడీపీ ల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నడుస్తుంది. ప్రస్తుత టీడీపీ సిట్టింగ్  ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు అసమ్మతి సెగ  తగులుతుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న తంబళ్ళపల్లే లో నాయకులు కండువాలు మార్చినా క్యాడర్ మాత్రం పటిష్టంగా ఉంది. దాంతో టీడీపీ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. గత ఎన్నికల ముందు టీడీపీ పార్టీ వీడి వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. నిజానికి ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు అంతంత మాత్రమే.  జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం పై కన్నేశారు. ఆయన తన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ ను వైసీపీ నుంచి బరిలోకి దించుతున్నారు. ఈ నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయం వారిదే అని పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ జలాలు, హంద్రీనీవా కలువల ద్వారా నియోజకవర్గంలో నీరు పారించడంతో ఇక్కడి రైతులు సంతోషంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థతుల్లో వైసీపీ శ్రేణులు ప్రజలతో మమేకమై వారి బలాన్ని పెంచుకుంటూ ఎన్నికలకు సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. తంబళ్ళపల్లె లో రోజురోజుకు రాజకీయ రంగులు మారుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: