అన్ని కులాలను సమానంగా చూసే పాలన అందిస్తానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ముఖ్యంగా  చంద్రబాబు మాదిరిగా ఒకే కులానికి పట్టం కట్టే విధంగా పాలన ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీలో కులపిచ్చి పాలన సాగుతోందని. తన హయాం దానికి భిన్నంగా ఉంటుందని జగన్ అన్నారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి సభను జగన్ ఈ రోజు విశాఖ జిల్లా నర్శీపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారమంతా ఒకే కులానికి పంచిపెట్టడం బాబుకే చెల్లు అంటూ సెటైర్లు వేశారు. తాను సంక్షేమ రాజ్యాన్ని తెస్తానని హామె ఇచ్చారు. గ్రామాలను పీక్కుతింటున్న జన్మ భూమి కమిటీలని కూకటి వేళ్లతో పెకిలిస్తామని జగన్ చెప్పారు. రైతులు మెచ్చే పాలన తెస్తామని ఆయన అన్నారు. జలయగ్నానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు.


తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ ఈ సందర్భంగా ప్రజలకు వినతి చేశారు. చంద్ర‌బాబు నాయుడు ఎండ మావుల‌ను చూసి న‌మ్మ‌కండి. ఈ ఎన్నిక‌లు ధ‌ర్మానికి అధ‌ర్మానికి మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం. విశ్వ‌స‌నీయ‌త‌కు వంచ‌న మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం అంటూ జగన్ పిలుపు ఇచ్చారు. అధికారంలోకి రాగానే తన హామీలన్నీ ఆచరణలో చేసి చూపెడతానని  జగన్ హామీ ఇచ్చారు. 
నక్కజిత్తులమారి చంద్రబాబుతో తన పోరాటమని, అందుకోసం  ప్రజల అశీస్సులు కావాలని జగన్ కోరారు. కాగా నర్శీపట్నంలో జరిగిన తొలి ఎన్నికల మీటింగ్ విజయవంతమైంది. సభ్లో పాల్గొన్న వారంతా జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: