రాజకీయాల్లో ఉన్నపుడు ప్రజల నాడి పట్టుకోవడం చాలా ముఖ్యం. వారి ఆలోచనలకు భిన్నంగా నేత‌లు వెళ్ళాలనుకున్నపుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఇప్పటి జనం కేవలం పించన్లు ఇతర తాయిలాలతో సరిపెట్టుకోవడం లేదు. అభివ్రుధ్ధిని కూడా చూస్తున్నారు. ఇచ్చిన హామీలను కూడా వల్లె వేస్తున్నారు.


విషయనికి వస్తే విశాఖ జిల్లా నర్శీపట్నంలో జగన్ తొలి సభ సూపర్ హిట్ అయింది. మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకు మండే ఎండలో వేలాదిగా జనం తరలిరావడం జగన్ సభ ఎలా హిట్ అయిందో చెప్పకనే చెబుతున్నాయి. జగన్ సభలో మాట్లాడుతున్నంతసేపూ సీఎం జగన్ అంటూ హోరెత్తించేశారు. ఇక సభకు జగన్ ఓ మాదిరిగా వస్తారని వూహించిన వైసీపీ నాయకులే షాక్ తినేలా పొటెత్తారు. దాంతో తొలి సభ జయప్రదం కావడంతో వైసీపీకి తెగ హుషార్ వచ్చేసింది.


గత ఎన్నికల్లో కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈసారి ఎలాగైనా నర్శీపట్నం కోట బద్దలు కొడతామని అంటోంది. నిజానికి ఈసారి టీడీపీకి ఇంటి కష్టాలు కూడా ఎక్కువయ్యాయి. మంత్రి అయ్యనంకు, సోదరుడుకి విభేదాలు రావడం, పార్టీలో కూడ వర్గ పోరు ఇవన్నీ చూస్తూంటే ఈసారికి ఫ్యాన్ నీడన నర్శీపట్నం చేరిపోతుందని అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: