సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై వారం రోజులు గడచింది. ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది. ఏపీలో గత వారంలోనే రాజకీయం మొత్తం మారిపోయింది. రెండు ప్రధాన పార్టీలు స్పీడ్ బాగా పెంచేశాయి. అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీ మధ్య పరుగు పందెమే జరుగుతోంది.


అయితే నలభయ్యేళ్ళ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇంకా టికెట్లను ఖరార్ చేసుకోలేకపోయారు. ఇప్పటికి రెండు జాబితాలు విడుదల చేసినా చాలా చోట్ల టికెట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా పార్టీలో టికెట్ల లొల్లి అలాగే సాగుతోంది. కొన్ని సీట్లకు అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారుతోంది. పోటీ చేస్తారనుకున్న వారు నో చెప్పడం, కొన్ని సీట్లు కావాలని పట్టు పట్టడంతో చిక్కు ముడి వీడడం లేదు
మరో వైపు వైసీపీ అధినేత జగన్ మాత్రం ఒకేసారి మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు టికెట్లు ఇచ్చేశారు. అంతే కాదు ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. నిన్న ఒకే  రోజు మూడు జిల్లాలో టూరేసి  ప్రచారాన్ని హోరెత్తించారు. నోటిఫికేషన్ విడుదలకు ముందు అభ్యర్ధులను ఎంపిక చేస్తామంటూ చెప్పిన జగన్ మాట ప్రకారం అదే పని చేశారు.


ఇక ఒకేసారి అభ్యర్ధుల విడుదల అన్నది కూడా చిన్న విషయం కాదు. అసమ్మతి ఉంటుంది. అయినా లెక్కచేయకుండా జగన్ డేరింగ్ గా జాబితా విడుదల చేయడం విశేషమే మరి. ఇప్పటికైతే ఈ రన్నింగ్ రేస్ లో బాబు కంటే జగన్ ముందున్నారు. అంతే కాదు దూకుడు మీద కూడా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: