విశాఖ ఉత్తర నియోజకవర్గం భిన్న వర్గాల సమ్మేళనం. ఇక్కడ మెట్రో సిటీ వాతావరణం ఉంటుంది. కులాలు ఉన్నా డెవలప్మెంట్ మీద జనాల ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మంత్రి గంతా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున బిల్డర్ కేకే రాజుకు టికెట్ ఇచ్చారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బరిలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యనే ఉంటుందని అంటున్నారు.


ఇక్కడ గత ఇరవయ్యేళ్ల నుంచి టీడీపీ గెలిచింది లేదు. దాంతో మంత్రిని ఇక్కడ పోటీకి దింపారు. గంటా ట్రాక్ రికార్డ్ చూస్తే ఇప్పటి వరకూ ఎక్కడ ఓటమి పాలు కాని చరిత్ర ఆయనది ప్రతీ ఎన్నిక‌కూ ఓ సీటు, పార్టీ మార్చే గంటా ఈసారి సీటు మాత్రమే మార్చారు. గంటా తనదైన రాజకీయ వ్యూహాలతో ఉత్తరంలో గెలవాలనుకుంటున్నారు. 


అయితే సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా బలమైన నేతగా ఇక్కడ ఉన్నారు. ఆయన అయిదేళ్ళ  పాటు అవినీతి మరక లేకుండా ఉన్నారన్న పేరు తెచ్చుకున్నారు. చివరి నిముషంలో బీజేపీ  విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంతో రాజుకు కలసివస్తుందని అంటున్నారు. అభివ్రుధ్ధి పనులను కూడా ఆయన చేసి చూపించడం, ఎమ్మెల్యేగా మంచి మార్కులు రావడంతో ఆయన గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు. 


ఇక వైసీపీ తరఫున కేకే రాజుకు వ్యక్తిగతంగా  కొంత పలుకుబడి ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా పార్టీ మీదనే ఆధారపడుతున్నారు. వైసీపీ గాలి బాగా వీస్తే ఆయనకు ఎదురులేదంటున్నారు. మొత్తానికి ఈ ముగ్గురి పోటీ రసవత్తరంగా ఉంటుందని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: