గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే.  ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే.  ఇక ఎంపీ ఎన్నికల కోసం అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.  ఏపిలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సోమవారం నాడు విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు.   
Image result for telangana
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9 సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం ఉంది. అంటే ఇవాల్టితో కలిపి ఇంకా ఉన్నది 23 రోజులే. ప్రచారం ప్రశాంతంగా చేసుకోవాలంటే... ముందుగా నామినేషన్ వేయాలి. ఈ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థులు ఇవాళ్టి నుండి నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు.   
Related image
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకార ప్రక్రియకు తెర తీశారు. ఈ నెల 25 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 28 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. పోలింగ్‌ ఏప్రిల్‌ 11న జరుగుతుంది. మే 23వ తేదీన కౌంటింగ్ జరుగుతోంది. ముహూర్తాల ప్రకారం ఇవాళ ద్వాదశి, 22న విదియ, 23న తదియ, 25న పంచమి మంచి రోజులుగా భావిస్తూ ఆ తేదీల్లో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేయబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: