తెలంగాణ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు తన కింద పనిచేశారంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేం కాదు! చంద్రబాబే! మా కింద పనిచేశారు" అని ఆయన ఆదివారం మీడియాతో అన్నారు.


తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు కంటే ముందు నుంచే కేసీఆర్, తాను క్రియాశీలకంగా ఉన్నామని ఎర్రబెల్లి చెప్పారు. టిడిపిలో చేరి నారా చంద్రబాబు.. గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టి పార్టీని సర్వ నాశనం చేశారని విమర్శించారు. తమ లాంటి వాళ్లను తెలుగుదేశం పార్టీలో తొక్కిపెట్టారని ఆరోపించారు. తెలంగాణ లో టీఆర్ఎస్‌ ను ఓడించాలని చూసిన చంద్రబాబు నాయుడుకు ఇక్కడి ప్రజలు ఏరకంగా బుద్ధి చెపారో గత తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు.

Image result for yerraballi comments on chandrababu seniority

చంద్రబాబు కాలాంతకుడు. తెలంగాణ లోనే కాదు ఆంధ్రా లోనూ టీడీపీనీ నాశనం చెసే వరకు ఆయన నిద్రపోడని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూపుల సంస్కృతిని పెంచి పోషించింది చంద్రబాబే నని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏ స్థాయికి దిగజారారో అన్ దరికీ తెలుసన్నారు. టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవటమే తమ కొంప ముంచిందని ఆంధ్రా ప్రాంత అన్నీ రాజకీయ పక్షాల ప్రజా పరతినిధులు మాత్రమే కాదు మంత్రులు ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు.


కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే అదే కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవడాన్ని జనం అక్రమ సంబంధంగా భావించి ఏ ఒక్కరూ సమర్థించలేదని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ లో సీఎం కేసీఆర్, తాను సీనియర్లుగా ఉన్నామని, ఆ తరువాతే నారా చంద్రబాబు నాయుడు వచ్చారని, ఆయన తమ కంటే జూనియర్ అని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పటికి గాని చంద్రబాబు కంటే సీనియర్ అని చెప్పటం గుర్తుంచదగ్గ విషయం.

Image result for yerraballi comments on chandrababu seniority

తాను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి గా ఉంటే రేవంత్‌ రెడ్డితో పాటు మరి కొందరిని ఎగదోసి తమలో తమకే కొట్లాట పెట్టి తెలంగానాలో తెలుగుదేశం పార్టీ సర్వ నాశనానికి కారణం అయ్యారని ఆరోపించారు. తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందన్న సంకేతాలు తమకు స్పష్టంగా అన్నారు.


నిజాయతీని, నీతిన, నిలువునా పాతేసి నిజాయతీ పరుణ్ణి, నిప్పునని చెప్పుకొనే ఒక రాష్ట్ర అధినేతకు ఇలాంటి సవాళ్ళ పరంపర ఎదురవ్వటం గ్యారెంటీ. తమకు, తమ కుటుంబానికి, తమ కులానికి, తమ పార్టి సభ్యులకు మాత్రమే అధికారం దక్కాలనే తపన తప్ప, సేవచేసి ప్రజా హృదయాలను గెలుద్ధామనే ఆలోచనలేని, దురాశాపరుణ్ణి పాతేసే రోజులు ఒక నెలలోపే నంటూ తెగేసి చెపుతున్నారు ప్రజలంతా.   



మరింత సమాచారం తెలుసుకోండి: