వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది.  హత్య జరిగిన దగ్గర నుండి వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన పరమేశ్వరరెడ్డి అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. అదృశ్యమంటే రెడ్డి ఏమీ చనిపోలేదు. వివేకా హత్య ముందు కొద్ది రోజుల నుండి కనపించటం లేదు. అంటే వివేకా హత్యతో పరమేశ్వరరెడ్డి కనిపించకుండా పోవటానికి దగ్గరి సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

పరమేశ్వరరెడ్డి జిల్లాలోని కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చురుగ్గా ఉంటాడని సమాచారం. వైఎస్ వివేకాతో సన్నిహిత సంబంధాలున్నాయంటే బహుశా ఆ సంబంధాలే పెట్టుబడి కూడా కావచ్చు. వైఎస్ వివేకాను చూపించే జిల్లాలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహిస్తుంటారని పోలీసుల అనుమానం. వ్యాపార లావాదేశీల్లో భాగంగా తొందరలో జిల్లాలో ఓ సంచలనం చూస్తారంటూ కొందరితో పరమేశ్వరెడ్డి చెప్పినట్లు సమాచారం. అందుకనే రెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

 

ఇదే విషయాన్ని ఓ మీడియాతో పరమేశ్వరెడ్డికి కుటుబంసభ్యులు మాట్లాడుతూ, వివేకా హత్యతో రెడ్డికి ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేస్తున్నారు. రెడ్డి  చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా చెబుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగటమే తమకు సరిపోతోంది కాబట్టి ఇతర విషయాలను తాము పట్టించుకోవటం లేదంటున్నారు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెబుతున్న పరమేశ్వరరెడ్డి పోలీసులకు మాత్రం దొరకటం లేదు. ఇక్కడే ఆయనపై అందరికీ అనుమానం ఎక్కువైపోతోంది. క్షేత్రస్ధాయిలోని సమాచారం బట్టి వివేకా హత్య విషయం ఆయన సన్నిహితులకు ముందే సమాచారం ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయ్.

 


మరింత సమాచారం తెలుసుకోండి: