కేసీఆర్ కొత్త రాగం అందుకుంటున్నారు. ఇప్పుుడు కొత్త పార్టీ పెడతానంటున్నారు. అదేంటీ ఆల్ రెడీ టీఆర్‌ఎస్ ఉంది కదా.. మళ్లీ ఇంకో కొత్త పార్టీ ఏంటనుకుంటున్నారా.. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమతి కదా.. మరి జాతీయ స్థాయి పార్టీకి ఇది సరిపోదు కదా. 

kcr karimnagar meeting కోసం చిత్ర ఫలితం


జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్న కేసీఆర్.. ఇక జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ సభలో తన ఆలోచన బయటపెట్టారు. దేశం గతిని మార్చేందుకు.. భారతావనిని ప్రగతి పథాన నడిపేందుకు ఈ ఎన్నికల తరువాత త్వరలోనే అవసరాన్ని బట్టి  జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు.

సంబంధిత చిత్రం

ప్రస్తుతం దేశంలో  బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల వైఖరి వల్లనే అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నామని.. మోదీకి, రాహుల్‌గాంధీ ఇద్దరూ దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారే తప్ప.. అసలైన అభివృద్ధి కోసం ఆలోచించడం లేదన్నది కేసీఆర్ భావన. కరీంనగర్‌లో తెరాస ఎన్నికల శంఖారావ సభలో ప్రసంగించిన కేసీఆర్.. 16 స్థానాల్లో గెలుపొందడంతోపాటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేలా.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తామన్నారు. 

సంబంధిత చిత్రం

ఇంకా కేసీఆర్ ఏమన్నారంటే.. నన్ను దేశ రాజకీయాల్లోకి వెళ్లమంటారా.. వెళ్లమంటే పిడికిలి బిగించి దీవించండి. మీ దీవెనలతో ముందుకెళ్త. దేశ రాజకీయాల్లో తెలంగాణ పెద్దపాత్ర పోషించాలి. పెనుమార్పులు రావాల్సి ఉంది. మీ బిడ్డగా కరీంనగర్‌ దీవెనతో దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి అద్భుతమైన భారతదేశాన్ని నిర్మిస్తానని మాటిస్తున్నానన్నారు కేసీఆర్.  



మరింత సమాచారం తెలుసుకోండి: