గత ఎన్నికల్లో కొంచెంలో దూరమైన అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్స్ కూడా వైసీపీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి వలసలు రాబోయే ఫలితాన్ని కొంత వరకూ నాడి పట్టిస్తున్నాయి. 

ys jagan padayatra కోసం చిత్ర ఫలితం


జగన్‌కు బాగా కలిసి వచ్చే అంశాలు..
1. అభ్యర్థుల ఎంపికలో ఎక్కడా మొహమాటానికి తావివ్వకుండా గెలుపు గుర్రాలను వైఎస్‌ జగన్‌ ఎంపిక చేసి టిక్కెట్లు కేటాయించారు. అభ్యర్థుల సమర్థతను  అన్ని విధాలుగా లెక్కలు వేసుకున్నాకే.. ఎంపిక చేశారు. 
2. ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడింది తానేనని జగన్ చెబుతున్న విషయం కన్విన్ సింగ్ గా ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తే కేంద్రంలో వారికే మద్దతిస్తామని జగన్ చెబుతున్నారు.
సంబంధిత చిత్రం


3. ఎన్నికల ప్రణాళికను రెండేళ్ల కిందటే జగన్‌ ప్రకటించి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాలనూ ఆకట్టుకునే నవరత్నాల హామీలను జనంలోకి తీసుకెళ్లారు. వీటి ప్రభావంతోనే చంద్రబాబు ఫించన్ రెట్టింపు, డ్వాక్రా మహిళలకు పదివేలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 
4. పాదయాత్ర.. రాష్ట్రం మొత్తం కవర్ అయ్యేలా జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చింది. రాష్ట్ర నాయకుడిగా తీర్చి దిద్దింది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్‌, 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ కు కూడా ఇదే కలిసిరానుంది. 

సంబంధిత చిత్రం


5. ప్రభుత్వ వ్యతిరేకత.. చంద్రబాబు సర్కారు ఈ ఐదేళ్లలో పెద్దగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేదు. అమరావతి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యేలపై ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: