ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఉంటుందనే విషయం 2014లో ప్రూవ్ అయింది. జాతీయస్థాయిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా టీంలను నియమించుకున్నాయి. ఈసారి కూడా సోషల్ మీడియా వేదికగా వాగ్బాణాలు సంధిస్తూ పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి.

Image result for chowkidar modi

సోషల్ మీడియాను వాడుకోవడంలో బీజేపీ ఎంతో ముందుంది. 2014 ఎన్నికల్లో మోదీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా పాత్రను కొట్టిపారేయలేం. రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని టీం బీజేపీని ప్రజలకు చేరువ చేయడంలో సక్సెస్ సాధించింది. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీజేపీకి సేవలందించడం లేదు. కానీ బీజేపీ మాత్రం సోషల్ మీడియాను దున్నేస్తోంది. సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో వాడుకోగలిగితే మళ్లీ వియం సాధించవచ్చనే ధీమా ఆ పార్టీలో కనిపిస్తోంది.

Image result for chowkidar modi

ఇప్పుడు మోదీ ట్విట్టర్ వేదికగా ప్రచారం షురూ చేశారు. ఇన్నాళ్లూ నరేంద్ర మోదీగా ఉన్న పేరును చౌకీదార్ నరేంద్ర మోదీ అని మార్చేశారు. ఇన్నాళ్లూ ప్రచారసభల్లో కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ వస్తున్నారు మోదీ. తాను కాంగ్రెస్ నేతల్లాగా దోపిడీదారుడిని కాదని, ప్రజలకు సేవకుడినని ప్రకటిస్తూ వచ్చారు. అయితే డబ్బున్నోళ్లకు మోదీ సేవకుడని కాంగ్రెస్ విమర్శిస్తూ వస్తోంది. అయినా ఏమాత్రం లెక్కచేయని మోదీ.. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లో పేరునే చౌకీదార్ గా మార్చేసుకున్నారు. అందుకు అనుగుణంగా బీజేపీ నేతలందరూ మై భీ చౌకీదార్ అనే యాష్ ట్యాగ్ తో ట్వీట్లు పెడుతున్నారు.

Image result for chowkidar modi

మోదీ అలా పేరు మార్చుకోగానే కాంగ్రెస్ విరుచుకుపడింది. సూట్ బూట్ కా చౌకీదార్, ఇండియా బేవకూఫ్ నహీహై అనే యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేసింది. ఇండియాలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి అక్కడ హ్యాపీగా ఉంటున్నవారి ఫోటోలతో పోస్టు పెట్టంది. ఇలాంటి వారందరికీ మోదీ సేవకుడిగా ఉంటున్నాడంటూ మండిపడింది. రాఫెల్ ఉదంతాన్ని ప్రస్తావించింది.

Image result for chowkidar modi

అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ల సోషల్ మీడియా టీంలు పూర్తిస్థాయిలో యాక్టివేట్ అయ్యాయి. ఇప్పటిదాకా కేవలం కౌంటర్లకే పరిమితమైన సోషల్ మీడియా వార్ ఇప్పుడు పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం బహిరంగ వేదకలపైనే వాగ్బాణాలు సంధించుకున్న నేతలు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికనే బహిరంగ వేదికలుగా మార్చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: