ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తల్లో మరియు నాయకులతో తొలుస్తున్న ఏకైక ప్రశ్న పవన్ కళ్యాణ్ వివిధ పార్టీలతో పెట్టుకున్న పొత్తు గురించే. రాజకీయంగా గా ఒక శక్తిగా ఎదిగేందుకు తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను నమ్ముకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బహుజన సమాజవాది పార్టీతో చేతులు కలపడం చూసి రాజకీయ విశ్లేషకులు అతను పెద్ద పొరపాటే చేశాడు అంటున్నారు. రాష్ట్రంలో సీపీఐ మరియు సీపీఎం తో పొత్తు ఒక రకంగా అర్థవంతంగా ఉన్నా, బీఎస్పీ పార్టీకి 21 అసెంబ్లీ మరియు 3 ఎంపీ స్థానాలు కట్టపెట్టడం అనేది ఇక్కడ ఎవ్వరికీ మింగుడుపడని విషయం. సీపీఎం మరియు సీపీఎం సీట్ల సర్దుబాటు లో తెలివిగా వ్యవహరించిన పవన్ అసలు రాష్ట్ర ప్రజలకు సరిగ్గా పరిచయం లేని పార్టీని తెచ్చి అభిమానుల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్యలు జనాలను అయోమయానికి గురి చేసే అవకాశం లేకపోలేదు. పవన్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టేందుకు ఇంకా చాలా సమయం ఉందని, ముందు ఇక్కడ పట్టు కొల్పోకుండా సరైన గుర్తింపు సంపాదిస్తే తరువాత అన్నీ అతని వెన్నంటే వస్తాయి అంటున్నారు జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: