2009 లో నియోజకవర్గాల్ల పునర్విభజన సమయంలో భాగంగా ఆలూరు జనరల్ స్థానంగా మారింది. ఇక్కడ నుండి మసాలా ఈరన్న మూడు సార్లు గెలిచారు. ఇక్కడినుంచి రెండుసార్లు ఎం.మారెప్ప వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2009 లో ఇక్కడ గెలిచిన నీరజరెడ్డి గతంలో పత్తికొండ లో పోటీ చేసి గెలిచారు. 2009 లో మహాకూటమి అభ్యర్థిగా, ప్రస్తుత సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2014 లో కాంగ్రెస్ అభ్యర్తిగా కోట్ల సుజాతమ్మ పోటీ చేసి డిపాజిట్ దక్కించుకున్నారు. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరుగగా అందులో కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ మూడుసార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలుపొందారు.అయితే ఈ సారి రెండు ప్రధాన పార్టీల మధ్యే పోరు హోరాహోరీ సాగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేత గుమ్మనురు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉంటు ఈసారి కూడా వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. అయితే అటు సీనియర్ నేత కోట్ల సుజాతమ్మ ను పోటీకి దించుతుంది టీడీపీ పార్టీ. మరి ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీలో ఉంటుందో లేదో స్పష్టత రాలేదు. అయితే ఈ సారి గెలుపు ఎవరి వైపు వచ్చి వాలుతుందో అనే ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: