ముస్లిం నాయకులందరిలోనూ విశిష్టమయిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న నాయకుడు ఎంఐఎం అధినేత అసిదుద్దీన్ ఓవైసీ.  తండ్రి వద్ద నుంచి పార్టీ కళ్ళాలను చేపట్టిన దగ్గర్నుండి నేటి వరకు ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా పరిపూర్ణ అవగాహనతో దేశం మొత్తం మెచ్చే విధంగా ఆ పనిని చేయడంలో అసద్ ప్రసిద్ది గాంచారు.


మొన్నటి పుల్వామా దాడిలో మోదీని విమర్శిస్తూనే..పాకిస్థాన్ ప్రధానికి గడ్డి పెట్టిన విధానం భారత దేశ ముస్లింలకే కాకుండా దేశం మొత్తానికి ఆదర్శం. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్‌ ఓవైసీ పోటీ చేసి గెలుపొందారు.


తెలంగాణ లోక్ సభ్ ఎన్నికలలో హైదరాబాద్ నియోజక వర్గానికి ఎంపి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.  రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న హైదరాబాద్‌ కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కన్నన్‌కు నామినేషన్‌ పత్రాలను ఓవైసీ సమర్పించారు.  కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేసిన ఆయన గెలుపు తప్పనిసరిగా తమదే అనే ధీమాతో కనిపించారు.  


ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 28. లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: