ఆంధ్ర రాజకీయాలలో తిరుపతి నియోజకవర్గం అందరికీ చాలా సెంటిమెంట్. గతంలో ఇక్కడి నుండి పోటీ చేసిన చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా కీలకంగా రాజకీయ నేతలుగా ఎదిగారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత 13 జిల్లాల రాష్ట్రంలో మిగిలిన ఆంధ్ర రాష్ట్రం లో రాబోతున్న రెండు అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి ఎలాగైనా గెలవాలి అని వైసిపి మరియు టిడిపి పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుండి తిరుపతి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ నీ రంగంలోకి దింపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదే క్రమంలో ఈ నియోజకవర్గం నుండి రాష్ట్రంలో మంచి జోరు మీద ఉన్న వైసిపి పార్టీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి ని రంగంలోకి దింపారు జగన్. మరోపక్క జనసేన పార్టీ నుండి ఈ ప్రాంతంలో ఎవరి పోటీ చేస్తారు అన్న విషయం ఇప్పటికి బయటికి రాలేదు.

గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి ఈ ప్రాంతం నుండి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అని అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు.


అయితే ప్రస్తుతం తిరుపతి లో ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే కచ్చితంగా ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గెలవడం ఖాయం అని..జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడిగా మరియు ఆయన కుటుంబానికి..మరియు నియోజకవర్గానికి రాజకీయాలలో విశ్వాసం గా ఉంటూ ప్రజలలో అందుబాటులో ఉండే నాయకుడిగా మంచి పేరు ఉన్న నేపథ్యంలో రాబోతున్న ఎన్నికల తిరుపతి నుండి వైసిపి పార్టీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి కరవడం ఖాయమని ఆ ప్రాంతంలో ఉన్న కొంత మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాబోతున్న ఎన్నికల తిరుపతి నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: