త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రాబోతున్న ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి పోటీ మాత్రం వైసిపి మరియు టిడిపి పార్టీ ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. జనసేన పార్టీ ఉన్నాగాని కొద్దిగా మాత్రమే ప్రభావితం చేసే విధంగా ఉన్నట్లు ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానం బట్టి తెలుస్తోంది.


అయితే ప్రస్తుతం మాత్రం పల్నాడు రాజకీయాలు పట్ల చాలామంది రాష్ట్ర ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ హవా కష్టంగా ఉన్న నేపథ్యంలో రాబోతున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందో లేదో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తుంటే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండే పల్నాడు లో ఏ మాత్రం అభివృద్ధికి చంద్రబాబు సరిగ్గా చోటివ్వని నేపథ్యంలో కచ్చితంగా ఈ ప్రాంతంలో వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చాలా సర్వేలలో ఇప్పటికే ఫలితాలు బట్టి తెలుస్తుంది.


ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వైసీపీ పార్టీ తరఫున ఇక్కడ ఇప్పటికే చాలా బలమైన అభ్యర్థులను మరియు ప్రజా అభిమానం కలిగిన నేతలను నిలబెట్టి ఎన్నికల వేడిని పెంచారు జగన్.


ముఖ్యంగా విశ్వసనీయత రాజకీయాలు నిబద్ధత కలిగిన నేతగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడిగా జగన్ ప్రస్తుత రాజకీయాల్లో రాణిస్తున్న నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలలో కచ్చితంగా పల్నాడు ప్రజలు వైసిపి పార్టీని ఆదరిస్తారు అని అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ నేతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: