ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి కంచుకోట...ఆ పార్టీ ఆవిర్భావం నుండి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. ఇక టీడీపీ గెలిచిన అయిదుసార్లులో చెంచు గరటయ్య4సార్లు..కరణం బలరాం ఒకసారి గెలిచారు. 2009, 2014లో కాంగ్రెస్ నుండి ఒకసారి, వైసీపీ నుండి ఒకసారి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. 14లో రవి కేవలం 4 వేల ఓట్ల తేడాతో కరణం బలరాం తనయుడు వెంకటేష్‌పై విజయం సాధించారు. అయితే గెలిచిన కొన్నిరోజులకే గొట్టిపాటి టీడీపీలో చేరారు. కానీ బలరాం, గొట్టిపాటి కుటుంబాలకి పడదు. దీంతో బలరాం ఆయన రాకని తీవ్రంగా వ్యతిరేకించారు. వీరికి చాలాసార్లు గొడవలు జరిగాయి. దీంతో చంద్రబాబు వీరిని కూర్చోబెట్టి సయోధ్య కుదర్చారు. ఇక అప్పటి నుండి వీరు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు.


ఇక మరికొద్దీరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ని చంద్రబాబు గొట్టిపాటికే ఇచ్చారు. ఇప్పటికే ఆయన ప్రచారంలో కూడా దిగేశారు. అటు కరణం బలరాంకి చీరాల టికెట్ ఇచ్చారు. కాగా, గొట్టిపాటి టీడీపీలో చేరక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ప్రజల సమస్యలు తెసుకుంటూ.. ముందుకు సాగారు. ఈ క్ర‌మంలోనే పింఛ‌న్లు, రోడ్ల విస్త‌ర‌ణ‌, ప‌సుపుకుంకుమ ప‌థ‌కం వంటివి ప్రజలకి సంక్రమంగా అందాయి. పైగా ఇక్కడ టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉంది. అయితే ఎన్నికల్లో గొట్టిపాటి, కరణం మధ్య రాజీ కుదిరి ఈ రెండు వర్గాలు కలిసి పని చేస్తే టీడీపీకి తిరుగు ఉండదనేది రాజకీయవర్గాల అంచనా. కాకపోతే కరణం చీరాల వెళ్లడంతో...వారు అక్కడ గెలుపుపై దృష్టి పెట్టారు. అలాగే అద్దంకిలో ఉన్న కరణం వర్గం గొట్టిపాటికి సహకరిస్తారనే తెలుస్తోంది.


అటు వైసీపీ నుండి సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్య పోటీ చేయనున్నారు. టీడీపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చెంచు గరటయ్య వైసీపీ నుండి పోటీ చేయడంతో అద్దంకిలో గట్టి పోటీ జరగనుంది. సీనియర్ నేతగా గరటయ్యకి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. కానీ టీడీపీకి ఉన్న క్యాడర్ వైసీపీకి తక్కువే అని చెప్పాలి. గొట్టిపాటి కూడా అభివృద్ధి బాగా చేశారు. దీంతో మరోసారి ఆయన విజయం ఖాయమని రాజకీయ విశ్లేషుకులు భావిస్తున్నారు.ఈ నియోజకవర్గంలో కమ్మ, ఎస్సీ వర్గాలు కీలకం... కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 45 వేలు, ఎస్సీ సామాజిక వర్గంలో మాల ఓటర్లు 26 వేలు, మాదిగ ఓటర్లు 26 వేలు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: