కర్నూల్ జిల్లాలో నిరుడు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి గెలిచాడు. అయితే.. ఇప్పుడు బ్రహ్మానందరెడ్డికి టికెట్ దక్కదనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయం ఆయనకు కూడా తెలిసిపోయిందట. నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ను ఎస్పీవై రెడ్డి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కేటాయించనున్నారని.. అందుకు బ్రహ్మానికి ఇవ్వబోయేది హ్యాండేనని టాక్. అయితే ఇప్పటికే బ్రహ్మానందరెడ్డి ప్రకటించేశారు.. తను ఇండిపెండెంట్ గా పోటీలో ఉండటం ఖాయమని.

Image result for chandra babu

ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇటు బ్రహ్మానికి టికెట్ ఇస్తే ఎస్పీవై కుటుంబం అలుగుతుంది. సహకరించదు. ఎస్పీవైకి టికెట్ ఇస్తే.. బ్రహ్మానందరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీచేయడం ఖాయమైనట్టే. మరోవైపు ఇక్కడ ఏవీ సుబ్బారెడ్డి కూడా రంకెలు వేస్తున్నారు. టికెట్ తనకూ కావాలని అంటున్నారు. వీరి మధ్యలో చంద్రబాబు ఏం తేలుస్తారో చూడాలి.

Image result for chandra babu

ఇక నంద్యాల ఎంపీ టికెట్ విషయంలో కూడా రచ్చసాగుతూ ఉంది. శివానందరెడ్డికి టికెట్ అని ఊరించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ పునరాలోచనలో పడ్డారట. బిజ్జం పార్థసారధి రెడ్డి తెరమీదకు వచ్చారని టాక్. ఇప్పుడు గనుక శివానందరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే గౌరు కుటుంబానికి అది మామూలు షాక్ కాదు. ఎందుకంటే.. శివానంద రెడ్డికి ఎంపీ టికెట్ పేరు చెప్పే.. గౌరు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చారు. గౌరు వెంకట్ రెడ్డికి శివానందరెడ్డి బావ అవుతారు. ఆ లెక్కలతోనే వీరు ఇటువైపు వచ్చారు. ఇప్పుడు శివానందరెడ్డికి బాబు హ్యాండిస్తే.. అప్పుడు గౌరు కుటుంబానికి కొన్ని వాస్తవాలు అర్థం అవుతాయిలే అని జనాలు అనుకుంటున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: