ప్రస్తుతం ఆంధ్ర రాజకీయంలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే రాబోతున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ స్పష్టమైన హవా కొనసాగిస్తోంది అన్ని సర్వేలలో ఫలితాలు వస్తున్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది జగన్ పాదయాత్ర. ఈ నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇప్పటికే వైసీపీ పార్టీ వైపు ప్రజలంతా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి అర్థమవుతుంది.

ముఖ్యంగా ఆ ప్రాంతంలో మహిళా మంత్రి ఉన్న ఆ మంత్రి పై ఇటీవల పర్యటనలోనూ జిల్లా ప్రజల తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో వైసీపీ పార్టీ గత ఎన్నికల్లోనే చాలా బలంగా ఉంది.

ఒక అనంతపురం జిల్లాలో తప్ప గత ఎన్నికలలో రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలలో వైసీపీ పార్టీ స్పష్టమైన మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. అయితే రాబోతున్న ఎన్నికలలో అనంతపురం జిల్లాలో ఈసారి వైసీపీ పార్టీ మొత్తం స్థానాలు గెలుచుకోవడానికి వ్యూహాలు వేస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల ఇడుపులపాయలో అసెంబ్లీ సెగ్మెంట్ల స్థానాలను పార్లమెంటు స్థానాలను ప్రకటించిన జగన్ అనంతపురం జిల్లాలో చాలా బలమైన క్యాండెట్ లను నిలబెట్టడంతో...ముఖ్యంగా అధికార పార్టీ టిడిపి గత ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావటం జిల్లాలో సరైన అభివృద్ధి చేయకపోవడం మొత్తం ఈ పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో వైసీపీ జెండా మెజార్టీ స్థానాల్లో పాగా వేస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: