మోదుగుల వేణుగోపాల్ రెడ్డి....ప్రస్తుతం వైసీపీ తరుపున గుంటూరు ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఆయన ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ని సైతం ఓడిస్తానని సవాల్ విసురుతున్నారు. కానీ మోదుగుల ఇంతక ముందు టీడీపీలోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.  అయితే 2009 ఎన్నికలకీ ముందు చిరంజీవి మీద అభిమానంతో ప్రజారాజ్యంలో చేరారు. కానీ అప్పటి ఎన్నికల సమయం వచ్చేసరికి సడన్‌గా ఆయన టీడీపీలో చేరిపోయి కేవలం 15 రోజుల్లో నరసరావు పేట పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలిచి సంచలనం సృష్టించారు. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యంల మధ్య జరిగిన త్రిముఖ పోరులో మోదుగుల ఎంపీగా విజయం సాధించారు.


ఇక ఎంపీగా ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. పార్లమెంట్‌లో ఆంధ్రా ప్రజల తరుపున పోరాడారు. విభజన సమయంలో తెలంగాణ ఎంపీలని ఢీకొని ఒక చిన్న సైజు యుద్ధమే చేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం. మళ్ళీ 2014లో ఏపీకి ఎన్నికలు రావడంతో ఆయన మళ్ళీ ఎంపీగానే పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆయనకి గుంటూరు వెస్ట్ సీటు ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన 17 వేల ఓట్ల పైనే మెజారిటీతో విజయం సాధించారు. గెలిచిన దగ్గర నుండి పార్టీతో ఉన్న....చివరి సంవత్సరం మాత్రం పార్టీకి దూరమయ్యారు. అలా దూరం జరుగుతూ వచ్చిన ఆయన ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుండటంతో టీడీపీని వైసీపీలో చేరారు.


పార్టీలో చేరడమే ఆయనకి జగన్ గుంటూరు పార్లమెంట్ సీటు ఇచ్చారు. దీంతో మొన్నటివరకు ఒకే పార్టీలో ఉన్న గల్లా జయదేవ్,మోదుగులలు ప్రత్యర్ధులుగా మారారు. దీంతో జయదేవ్‌ని భారీ మెజారిటీతో ఒడిస్తానని సవాల్ విసురుతున్నారు. అయితే ఒకసారి ఎంపీగా,ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోదుగులకి గుంటూరులో ఫుల్ క్రేజ్ ఉంది. కార్యకర్తలతో, ప్రజలతో మమేకం అవుతారని, పోల్ మేనేజ్‌మెంట్‌లో కూడా ధిట్టని అందరికీ తెలుసు.


 అలాగే గతంలో పార్లమెంట్‌లో ఏ విధంగా పోరాటం చేశారో ప్రజలు చూశారు. ఇక ఏ విషయంలో అయిన దూకుడు ప్రదర్శించటం ఆయన నైజం. ఆ దూకుడుతోనే  ఇప్పుడు గల్లాని ఓడించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా అన్నీ రకాలుగా ఆయన ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఈ సారి గుంటూరు ఎంపీగా తాను గెలవడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. మరి చూడాలి గుంటూరు ప్రజలు మోదుగుల వైపు ఉంటారో లేక గల్లా వైపు ఉంటారో.

 


మరింత సమాచారం తెలుసుకోండి: