అసెంబ్లీ, లోక్ సభకు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జాబితాలో అభ్యర్ధులను చూసిన తర్వాత అందరూ షాక్ కు గురయ్యారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధులను పక్కనపెడితే లోక్ సభ అభ్యర్ధుల జాబితాను అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇటువంటి అభ్యర్ధులను టిడిపి తరపున ఎవరైనా ఊహించగలరా అనే చర్చ జనాల్లో విస్తృతంగా మొదలైంది. అభ్యర్ధుల ఎంపికలో జగన్ వ్యూహాలు మాత్రం బ్రహ్మాండంగానే ఉన్నాయి.

 

ఇక జాబితా విషయాన్ని చూస్తే 25 లోక్ సభకు జగన్ ప్రకటించిన జాబితాలో తొమ్మిదిమంది పూర్తిగా కొత్తవారే. అందులోను నలుగురైతే మధ్య తరగతికి చెందిన వారే కావటం గమనార్హం. ఎస్సీ అభ్యర్ధుల్లో ఇద్దరు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళల్లో చదువుకుని పైకి వచ్చినవారే. ఇటువంటి అభ్యర్ధుల పేర్లను చంద్రబాబునాయుడు కనీసం పరిశీలినకు కూడా  తీసుకోరు. చంద్రబాబు చుట్టూ వందల కోట్ల రూపాయల బడాస్వాములే.

 

టిడిపి జాబితాను చూస్తే గల్లా జయదేవ్, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, జేసి పవన్ రెడ్డి, కేశినేని నాని, ఎస్పీవై రెడ్డి కుటుంబం, శివప్రసాద్, పనబాక లక్ష్మి, కిశోర్ చంద్రదేవ్, గంటా శ్రీనివాస రావు, మాగంటి బాబు, ఆది నారాయణరెడ్డి, రాయపాటి సాంబశివరావు, జిఎంసి బాలయోగి లాంటి వాళ్ళే కనబడతారు. వీళ్ళల్లో ఎవరిని తీసుకున్నా వందలు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారే. పార్టీ నడవటానికి ఇటువంటి వారు కూడా అవసరమే. సుజనా చౌదరి, సిఎం రమేష్ లాంటి వాళ్ళ ఎంపికలు ఇలాగే ఉంటాయి.

 

పార్టీ నడవటానికి డబ్బున్న వాళ్ళ అవసరం ఎంతుందో జనాల్లో గుడ్ విల్, క్రెడిబులిటీ ఉన్న వాళ్ళు కూడా అంతే అవసరం. కానీ చంద్రబాబు హయాంలో డబ్బుంటే చాలు ఏమైనా సాధించొచ్చు అనే అభిప్రాయం బలపడిపోయింది. దాంతో ధనస్వాములే టిడిపి తరపున అభ్యర్ధులుగా నిలబడుతున్నారు. అందుకే వైసిపి జాబితాలోని కొన్నిపేర్లు చూసిన తర్వాత జనాలు అంతగా ఆశ్చర్యపోతున్నారు.

 

వైసిపి జాబితా చూస్తే ముందుగా విధేయతకే పెద్దపీట వేసిన విషయం అర్ధమైపోతోంది. అదే టిడిపిలో చూస్తే డబ్బుకు మాత్రమే విలువన్నట్లు తయారైంది. కొత్తవాళ్ళకి పార్టీ కండువాలు కప్పినా మొదటి నుండి పార్టీలో కష్టపడిన వాళ్ళని, తనకు మద్దతుగా నిలబడిన వాళ్ళని జగన్ మరచిపోలేదు. కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళల్లో ఎక్కువమందిని పార్టీ అవసరాలకు మాత్రం ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అదే సమయంలో పార్టీలో సీనియర్లలో బొత్సా ఝాన్సీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరుదు కల్యాణి లాంటి వాళ్ళను కూడా పార్టీకోసమే పనిచేయమని చెప్పారు. దాంతోనే ఎవరిని ఎక్కడ వాడుకోవాలన్న విషయంలో జగన్ కున్న క్లారిటీ అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: