ఏపీలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ప్రస్తుతం ఉన్న సీన్ చూస్తే.. అధికార పక్షం కాస్త డిఫెన్సులో పడినట్టుంది. ప్రతిపక్ష వైసీపీ జోరుపై కనిపిస్తోంది. అన్ని సర్వేలు జగన్‌ దే అధికారం అని చెబుతున్నాయి. బహుశా ఇదే కాన్ఫిడెన్స్ జగన్‌లోనూ కనిపిస్తోంది. 



అందుకే జగన్ అప్పుడే తానే కాబోయే సీఎం అని ప్రకటించేసుకుంటున్నాడు. మరో నెల రోజుల్లో అధికారం మనదే అంటూ వైసీపీ కార్యకర్తలకు చెబుతున్నారు. ఐదేళ్ల పాటు మోసం చేసిన చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు ఎలా భరోసానిస్తామంటున్నారని మండిపడ్డారు. 

ys jagan in rayadurgam కోసం చిత్ర ఫలితం

రాయదుర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో జగన్‌ కాబోయే సీఎం తానే అన్నట్టు మాట్లాడారు. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ.. అవతల ప్రత్యర్థిగా ఉన్నది చంద్రబాబు. అన్ని వ్యవస్థలను వాడుకోగల సమర్థుడు. పోల్ మేనేజ్‌మెంట్‌ లో దిట్ట. 

ys jagan in rayadurgam కోసం చిత్ర ఫలితం

అందుకే జగన్ కు అప్పడే అంత తొందరపడకూడదని శ్రేయోభిలాషులు అంటున్నారు. చివరి నిమిషం వరకూ జాగ్రత్తగా ఉండకపోతే.. చంద్రబాబు ఏ క్షణంలోనైనా పోల్ సీన మార్చేయగలడని హెచ్చరిస్తున్నారు. వింటున్నావా.. జగన్.. సీఎం కుర్చీ నువ్వే ఎక్కుదువు కానీ.. కానీ అందాకా కాస్త జాగ్రత్త అంటూ సలహా ఇస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: