అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఎక్కువ స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా ఈసారి తాము మెజారిటీ చాటాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని సెగ్మెంట్లలో ఆసక్తి పోరు నెలకొంది. అటువంటి వాటిలో పుట్టపర్తి నియోజకవర్గం ఒకటి. 2009 లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి వరుసగా రెండసార్లు ఆయనే విజయం సాధించారు. .2009 లో కాంగ్రెస్ అభ్యర్థి కడపల మోహన్ రెడ్డి పై అలాగే 2014 లో వైసీపీ అభ్యర్థి చింతపంటి సోమశేఖర్ పై ఆయన విజయం సాధించారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా తమ పాగా వేయాలని వైసీపీ కూడా ఆశిస్తూ ఉండడంతో బలమైన పోరు జరిగేలా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసిన సోమశేఖర్ ను తప్పించి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నీ పోటీలో నెలపెడుతున్నట్టు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. పదేళ్ళుగా పదవిలో ఉన్న పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశానని, అదే తనను గెలుపునిస్తుంది అని ధీమాతో ఉన్నారు. ఇక్కడ జనసేన పార్టీ నుంచి కూడా అభ్యర్థి నిలబెట్టడం ఖాయమే అయితే ఇంకా ఎవర్ని నిలబెట్టాలి అనే విషయంపై స్పష్టత రాలేదు. పుట్టపర్తి టీడీపీ కి అనుకూలంగా ఉన్నా, ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ప్రతికూలంగా మారింది. ఇటు వైసీపీ కొన్ని మండలలో బలంగా ఉండి గెలుపు వేగాన్ని పుంజుకుంటుంది. ఇక్కడి ఇంఛార్జిగా వ్యవహరించి సీటు పొందిన వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ తన వ్యక్తిగత బలాన్ని కూడా పెంచుకున్నారు. ఇక గెలుపోటముల మధ్య పోరులో నిలిచేది ఎవరో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: