బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో కనిపించక పోవటం ఆశ్చర్యం కలిగించే అంశమే. ఒక పక్క ఎన్నికల హడావిడి జరుగుతుంటే బాలయ్య మాత్రం కనిపించడం లేదు. నంద్యాల ఉప ఎన్నికలతో పాటు కొన్ని నెలల కిందట తెలంగాణ ఎన్నికల్లో సైతం బాలయ్య క్యాంపైనింగ్ గట్టిగానే జరిగింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రం బాలయ్య చప్పుడే వినిపించడం లేదు. ఈసారి ఆయన గురించి మాట్లాడేవాళ్లే కరవయ్యారు. సాధారణంగా టికెట్ల కేటాయింపు సమయంలో బాలయ్య పేరు బాగా వినిపిస్తుంది. బాలయ్య ప్రతిపాదిత జాబితా ఒకటి బయటికి వస్తుంది. కానీ ఈసారి అలాంటిదేమీ జరగలేదు. బాలయ్య గురించి చర్చే లేదు.

Image result for balakrishna speech

తన చిన్న అల్లుడికి ఎంపీ టికెట్ అడిగాడని మాత్రం వార్తలొచ్చాయి.ఇక ప్రచారం సంగతి తీసుకుంటే అందులోనూ బాలయ్య సందడి పెద్దగా లేదు. ప్రతిసారీ వేరే నియోజకవర్గాలకు వెళ్లి బాలయ్య పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాడు. బాలయ్య ప్రచారం కోసం క్యాండిడేట్లు పోటీ పడుతుంటారు. తమ నియోజకవర్గానికి రమ్మంటే తమ నియోజకవర్గానికి రమ్మంటూ పోటీ పడతారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. బాలయ్యకు హిందూపురంలో కొంచెం ఇబ్బందికర పరిస్థిితులు ఉండటంతో అక్కడికి వెళ్లి వ్యవహారాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Image result for balakrishna speech

అక్కడ కూడా ఆయన ప్రచారం గురించి మీడియాలో పెద్దగా వార్తల్లేవు. తెలంగాణ, అంతకుముందు నంద్యాల ఎన్నికల ప్రచారంలో బాలయ్య ఏది పడితే అది మాట్లాడి వివాదాలు కొనితెచ్చుకున్నాడు. ఆయన వల్ల పార్టీకి లాభం జరగకపోగా.. నష్టం అవుతుందేమో అన్న భయం తెలుగుదేశం నాయకుల్లో పట్టుకుంది. ఈసారి ఏపీ ఎన్నికల్లో అవకాశాలు 50-50గా ఉన్న నేపథ్యంలో బాలయ్యను ప్రచారంలోకి దింపితే ఏం మాాట్లాడి ఏం వివాదం కొని తెస్తాడో అని బాబు భయపడినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: